రాజస్థాన్ పోలింగ్‌: సికార్‌లో రాళ్లు రువ్వుకున్నఇరు వర్గాలు.. పోలీసుల లాఠీచార్జి…

voters fired for officials locked polling booth for lunch hour in thungathurthy2
- Advertisement -

tension in prevails attack with Stones at Sikar in rajasthan polling

జైపూర్‌ : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో కొన్నిచోట్ల ఘర్షణలు చెలరేగాయి. సికార్‌లో ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్న ఘటనలో పోలీసులు లాఠీచార్జి జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

ఇక రాజస్థాన్ ఎన్నికలలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 41.39 శాతం పోలింగ్‌ నమోదైంది. మధ్యాహ్నం తర్వాత పోలింగ్‌ ఊపందుకుంటుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. చాలా పోలింగ్‌ బూత్‌ల వద్ద ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరి ఉన్నారు.

రాజస్థాన్‌లో మొత్తం 199 అసెంబ్లీ స్ధానాలకు  2274 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. 51,667 పోలింగ్‌ కేంద్రాల్లో 4.47 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పాలక బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌లు అధికార పగ్గాలు చేపట్టేందుకు హోరాహోరీ తలపడుతున్నాయి.

- Advertisement -