
- Advertisement -
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరానికి సుప్రీంకోర్టులో గురువారం ఎదురుదెబ్బ తగిలింది. ఐఎన్‌ఎక్స్ మనీల్యాండరింగ్ కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.
చిదంబరంను కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు అంగీకరించింది.
‘‘ఆర్థిక నేరాలలో అలా చేయలేం..’’
ముందస్తు బెయిల్‌ను ఓ హక్కుగా అందరికీ మంజూరు చేసే పరిస్థితి ఉండదని, ఆర్థిక నేరాలను భిన్నంగా చూడాల్సి ఉంటుందని, దర్యాప్తు తొలిదశలో ముందస్తు బెయిల్ జారీ చేస్తే దర్యాప్తు ప్రక్రియపై ప్రభావం ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.
ఈ నేపథ్యంలో.. చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్ధానం.. రెగ్యులర్ బెయిల్ కోసం ప్రత్యేక న్యాయస్ధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయనకు స్పష్టం చేసింది.
- Advertisement -








