23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం నటిపై దర్శకుడి అత్యాచారం.. నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు!

నటిపై దర్శకుడి అత్యాచారం.. నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు!

- Advertisement -

న్యూఢిల్లీ: నటిపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ దర్శక నిర్మాత హైదర్ జమీల్ హుస్సైన్ కాజ్మీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కాజ్మీకి ఇచ్చిన బెయిలును రద్దు చేయాలని కోరుతూ బాధిత నటి కోర్టును ఆశ్రయించింది. 

స్పందించిన న్యాయస్థానం నటి పిటిషన్‌పై స్పందన కోరుతూ ఇందిరా బెనర్జీ, సంజీవ్ ఖన్నాలతో కూడిన సుప్రీం ధర్మాసనం కాజ్మీ, మహారాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను జూలైకి వాయిదా వేసింది.

2012లో తనను టీ తాగేందుకు రమ్మని కార్యాలయానికి ఆహ్వానించిన దర్శకుడు కాజ్మీ అక్కడ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని నటి ఆరోపించింది. తనపై అతడు అత్యాచారానికి పాల్పడుతుండగా, కాజ్మీ సోదరి అనీష్ కాజ్మీ వీడియో తీసిందని పేర్కొంది.

ఈ విషయాన్ని ఎక్కడైనా బయటపెడితే ఆ వీడియోను ఇంటర్నెట్‌లో పెడతామంటూ తనను బెదిరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నటి పేర్కొంది. ఆ వీడియోను అడ్డం పెట్టుకుని కాజ్మీ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది.
గతేడాది దర్శకుడు కాజ్మీ.. నటిపై బహిరంగంగా దాడికి పాల్పడిన తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కాగా, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొని ఆరు నెలలుగా జుడీషియల్ కస్టడీలో ఉన్న కాజ్మీకి బాంబే హైకోర్టు ఇటీవలే బెయిలు ఇచ్చింది. దీంతో బాధిత నటి సుప్రీంకోర్టు ఆశ్రయించింది.

- Advertisement -