25.6 C
Hyderabad
Saturday, November 28, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ ఎన్టీఆర్‌ పుట్టినరోజున అభిమానులకి సర్‌ప్రైజ్ ఇవ్వనున్న జక్కన్న..!

ఎన్టీఆర్‌ పుట్టినరోజున అభిమానులకి సర్‌ప్రైజ్ ఇవ్వనున్న జక్కన్న..!

NTR's new business launched as Amaravati, Newsxpressonline
- Advertisement -

హైదరాబాద్: వరుస హిట్లతో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. చారిత్రాత్మక కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి పాత్ర పోషిస్తున్నారు.

అయితే మే 20న జూనియర్‌ ఎన్టీఆర్‌ పుట్టిన రోజు ఉంది. కానీ హరికృష్ణ మరణించి ఇంకా ఏడాది కూడా పూర్తికాకపోవడంతో ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. అలాగే అభిమానులని కూడా ఎలాంటి వేడుకలు చేయొద్దని కోరాడు.

కానీ రాజమౌళి మాత్రం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు ఓ సర్‌ప్రైజ్‌ గిప్ట్‌ ఇవ్వాలని ప్లాన్‌ చేస్తున్నారట. ఆ రోజున ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రకు సంబంధించిన ప్రీలుక్‌ను విడుదల చేయాలని చూస్తున్నారని సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే 20 వరకు ఆగాల్సిందే.

చదవండి: హిట్ చిత్రాల జాబితాలో నాని ‘జెర్సీ’
- Advertisement -