తమిళనాడు: ప్రస్తుతం దేశం మొత్తం ఎన్నికల మూడ్‌లో ఉంది. ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా కూడా, ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? కేంద్రంలో ఎవరి ప్రభుత్వం రాబోతోంది? ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. యువకుల నుండి వృద్ధుల వరకు అందరూ కూడా రాజకీయం గురించే మాట్లాడుతున్నారు.
ఇప్పటికే రెండు దశల పోలింగ్ ముగియడంతో, ఇక మూడో దశ పోలింగ్‌పై ఈసీ దృష్టి కేంద్రీకరించింది. మొత్తం ఐదు దశలలో ఎన్నికలని ఈసీ పూర్తి చేయనుంది. ఆ తరువాత మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
అసలు విషయానికొస్తే .. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన రాజకీయ అరంగేట్రంపై క్లారిటీ ఇచ్చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని ప్రకటించారు. తాజాగా తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన రజనీకాంత్, తమిళనాడులో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తే అప్పుడు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
చదవండి: నాలుగోస్సారి.. చంద్రబాబే సీఎం: రెడ్డి చెరువు సిద్ధాంతి సంచలన వ్యాఖ్యలు!
ఇదిలా ఉంటే మే 23 తర్వాత వచ్చే ఉప ఎన్నికల ఫలితాల్లో తన స్థానాల్లో అధికార అన్నాడీఎంకే నిలుపుకోలేని పక్షంలో, మధ్యంతర ఎన్నికలు వస్తే ఏం చేస్తారు అనే ప్రశ్నకు రజినీకాంత్ స్పందించారు. అలాగే ప్రధాని మోడీ మళ్లీ గెలుస్తారా? అనే ప్రశ్నకు మే 23 తర్వాత పీఎం ఎవరో తేలిపోతుంది అంటూ తనదైన స్టైల్‌లో చెప్పారు రజినీ.
ఇదిలా ఉంటే ఇటీవల తమిళనాడులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 38 లోక్‌సభ స్థానాలతో పాటు, 18 అసెంబ్లీ స్థానాలకు సైతం ఎన్నికలు నిర్వహించారు. అయితే ఈ 18 అసెంబ్లీ స్థానాల్లో అన్నాడీఎంకే విజయం సాధించడం ఆ పార్టీకి అత్యంత కీలకంగా మారింది. ఆలా వారు గెలవలేని పక్షంలో అన్నాడీఎంకే ప్రభుత్వం మైనారిటీలో పడిపోయే ప్రమాదం ఉంది.
ఈ నేపథ్యంలో తమిళనాడులో మరోసారి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడే అవకాశం ఉంది. ఎటువంటి సమయంలో రజినీ చేసిన వ్యాఖ్యలు పలు చర్చలకు దారితీస్తున్నాయి. కాగా ఇప్పటికే మరో తమిళ్ సినీ దిగ్గజం కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించి క్యాంపెయిన్ స్టార్ట్ చేసేశారు.
అయితే రజినీ రాజకీయాల్లో ప్రవేశిస్తున్నాని ప్రకటించినా, పార్టీ స్థాపన మాత్రం జరగలేదు. కాగా గత ఏడాది రజని పుట్టినరోజు సందర్భంగా పార్టీ పేరుని ప్రకటిస్తాడు అని ఎదురుచూసిన అభిమానులకి నిరాశే మిగిలింది. చూడాలి మరి పార్టీ ప్రారంభం ఎప్పుడు ఉంటుందో,…
చదవండి: షాకింగ్: హార్దిక్ పటేల్‌కు చేదు అనుభవం! ఎన్నికల ప్రచార సభలో.. అందరూ చూస్తుండగా…








