23.8 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ ‘బంతి స్టేడియం దాటింది బ్రో..’: నాని ‘జెర్సీ’పై ఎన్టీఆర్ ఉద్వేగభరిత కామెంట్స్!

‘బంతి స్టేడియం దాటింది బ్రో..’: నాని ‘జెర్సీ’పై ఎన్టీఆర్ ఉద్వేగభరిత కామెంట్స్!

NTR-Nani
- Advertisement -

టాలీవుడ్: టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం జెర్సీ. ఈ చిత్రం చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ స్పందించకుండా ఉండలేకపోయారు. ట్విట్టర్‌లో ఆయన తన స్పందన వెలిబుచ్చారు. ఈ సినిమా చాలా బాగుందని, ముఖ్యంగా ఎమోషనల్ కథని డైరెక్టర్ గౌతమ్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు అని చెప్పాడు.

‘‘స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చినా, ఇందులో ఫ్యామిలీ సెంటిమెంట్, లవ్ అండ్ టార్గెట్, అనుకున్నది సాధించడానికి ఎవరో ఒకరు కుటుంబ సభ్యులు తోడుంటే అది ఎంతటి కష్టమైనా విజయం సాధిస్తుంది.. అన్న డైలాగ్ నాకు బాగా నచ్చింది..’’ అని చెప్పాడు.

‘‘ఈ సినిమా చూస్తున్నంత సేపూ ఓ రోలర్ కోస్టర్‌లో విహరించిన అనుభూతి కలిగింది. ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకున్నందుకు దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి హ్యాట్సాఫ్ చెప్పాలి. తాను అనుకున్న పాయింట్‌ను గురితప్పకుండా తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. గౌతమ్‌కు అన్నివిధాలా సహకరించిన యూనిట్ సభ్యులందరికీ శుభాభినందనలు..’’ అని  తెలిపాడు.

అలాగే ‘‘నానీ బ్రో… నువ్వు కొట్టిన షాట్‌కు బంతి స్టేడియం దాటింది. నీ నటనా ప్రతిభ అద్భుతం, అద్భుతం, అద్భుతం.. జెర్సీ చిత్రంలో నీ నటన చాలాకాలం అందరికి గుర్తుండిపోతుంది. నిజంగా నిన్ను చూసి గర్విస్తున్నాను..’’ అంటూ తన హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -