21.7 C
Hyderabad
Friday, November 6, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం షాకింగ్: సహనం కోల్పోయి.. మహిళ చున్నీ లాగేసిన మాజీ సీఎం! అందరూ చూస్తుండగానే…

షాకింగ్: సహనం కోల్పోయి.. మహిళ చున్నీ లాగేసిన మాజీ సీఎం! అందరూ చూస్తుండగానే…

siddaramaiah
- Advertisement -

మైసూర్‌: కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్దరామయ్య ఆపుకోలేనంత ఆవేశంలో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో ఇతర రాజకీయ పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మైసూరులో జరిగిన బహిరంగ కార్యక్రమంలో ఓ మహిళ మాట్లాడిన తీరుకు సహనం కోల్పోయిన సిద్ధరామయ్య ఆమె వద్ద ఉన్న మైక్‌ను వేగంగా లాక్కొనే ప్రయత్నం చేశారు.  ఈ క్రమంలో మైక్‌తోపాటు ఆ మహిళ చున్నీ కూడా వచ్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో పలు టీవీ ఛానళ్లలో ప్రసారం కావడంతో వైరల్‌గా మారింది.

కాగా, సిద్ధ రామయ్య, మరి కొందరు నాయకులు సమక్షంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సదరు మహిళ అడిగిన ప్రశ్నకు సిద్ధరామయ్య తీవ్రంగా మండిపడ్డారు. ఆయన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి లేదనీ, సమస్యలు ఏవీ పరిష్కారం కావడం లేదంటూ ఆమె నిలదీశారు. దీంతో సిద్దరామయ్య ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

ఆమె వద్ద ఉన్న మైక్‌ లాక్కొవడంతో ఆమె చున్నీ కూడా వచ్చేసింది. ఆ తర్వాత కూడా జరిగిన తప్పిదాన్ని గ్రహించకుండా.. వెంటనే ఆమెను అక్కడి నుంచి వెళ్లిపొమ్మంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం సిద్ధరామయ్య. ఆ మహిళ పట్ల సిద్ధరామయ్య దారుణంగా ప్రవర్తించారని ఇతర రాజకీయ పక్షాలు, ప్రజలు మండిపడుతున్నారు. ఆయన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 

 

- Advertisement -