26.2 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం జియో నుంచి మరో సంచలనం.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు షాక్

జియో నుంచి మరో సంచలనం.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు షాక్

- Advertisement -

ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరతీసింది. ఈ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లకు దీటుగా ‘జియో మార్ట్’ పేరుతో ఆన్‌లైన్ గ్రోసరీ సంస్థను తీసుకొచ్చింది. ‘దేశ్ కీ నయీ దుకాణ్’ పేరుతో రిలయన్స్ ప్రారంభించిన ఈ సంస్థ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఆన్‌లైన్ సంస్థలకు గట్టిపోటీ ఇస్తుందని భావిస్తున్నారు.

ఈ స్టోర్‌లో ముందుగా రిజిస్టర్ చేసుకున్న వారికి మూడు వేల రూపాయల విలువైన కూపన్లను ఇవ్వనుంది. వినియోగదారులు ఆ తర్వాత జియోమార్ట్‌లో వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఈ కూపన్లు ఉపయోగించి డిస్కౌంట్ పొందవచ్చు.

జియో స్టోర్‌ని ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టు కింద నవీ ముంబై, థానే, కళ్యాణ్ ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. త్వరలోనే దీనిని దేశవ్యాప్తంగా విస్తరించనుంది. ఇందులో హోమ్ డెలివరీ, రిటర్న్ పాలసీ, ఎక్స్‌ప్రెస్ డెలివరీ వంటి సేవలు కూడా ఉన్నాయని రిలయన్స్ తెలిపింది. జియో మార్ట్ ద్వారా 50 వేలకు పైగా సరుకులను విక్రయించాలని రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకుంది.

- Advertisement -