26.2 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ పవన్ ఎప్పుడేం మాట్లాడతాడో ఆయనకే తెలియదు: మంత్రి నారాయణస్వామి

పవన్ ఎప్పుడేం మాట్లాడతాడో ఆయనకే తెలియదు: మంత్రి నారాయణస్వామి

- Advertisement -

చిత్తూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడేం మాట్లాడతాడో ఆయనకే తెలియదని ఏపీ మంత్రి నారాయణస్వామి ఎద్దేవా చేశారు. ఆయన నటుడు మాత్రమేనని, ఎప్పుడూ నటిస్తుండడమే ఆయన పని అని విమర్శించారు. పవన్ గత కొంతకాలంగా చంద్రబాబు తొత్తులా వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

చంద్రబాబుకు మద్దతుగా అమరావతిలో తిరిగితే ఏదైనా లాభం ఉంటుందనే పవన్‌ తిరుగుతున్నాడని మంత్రి పేర్కొన్నారు. పోటీ చేసిన రెండు చోట్లా పవన్ ఘోరంగా ఓడిపోయారని ఎద్దేవా చేశారు. చిరంజీవికి ప్రజల బాధలు తెలుసని, అందుకే ఆయన కనీసం 18 సీట్లలో అయినా గెలిచారని మంత్రి నారాయణస్వామి అన్నారు.

- Advertisement -