
న్యూఢిల్లీ: దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ న్యూ ఇయర్ వేళ ఆఫర్లకు తెరతీసింది. ‘ఫ్లిప్‌స్టార్ట్’ పేరుతో రేపటి నుంచి మూడో తేదీ వరకు మూడు రోజులపాటు వివిధ ఉత్పత్తులపై రాయితీలు ప్రకటించింది. వందలాది ఉత్పత్తులపై ఆఫర్లు అందిస్తోంది. వీటితోపాటు నో-కాస్ట్ ఈఎంఐ పేమెంట్ ఆప్షన్, ఎక్స్‌టెండెడ్ వారంటీ, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నట్టు తెలిపింది.
వీటితోపాటు ఎంపిక చేసిన బ్యాంకు డెబిట్ కార్డులపై ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రకటించింది. ‘ఫ్లిప్‌స్టార్ట్’సేల్‌లో ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీలపై 80 శాతం, హెడ్‌ఫోన్లు, బోట్, జేబీఎల్, సోనీ ఇతర కంపెనీల హెడ్‌ఫోన్లపై 70 శాతం వరకు రాయితీ ఇవ్వనున్నట్టు తెలిపింది.
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే మొబైల్ ఫోన్ కవర్లపై డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, టీవీలు, హోం అప్లయెన్సెస్‌పై 75 శాతం వరకు రాయితీ ఇవ్వనున్నట్టు తెలిపింది. అలాగే, ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్ ఉత్పత్తులపై 80 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.








