కేరళలో మళ్లీ రెడ్ అలర్ట్! అతి భారీ వర్ష సూచన.. తమిళనాడు, పాండిచ్చేరిలకు కూడా…

cyclone-effect
- Advertisement -

kerala-fisherman

తిరువనంతపురం: మొన్నీమధ్యన భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు మళ్లీ ఓ హెచ్చరిక. పాపం, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళకు ఇది శరాఘాతం లాంటిదే. వచ్చే శని, ఆదివారాల్లో కేరళతోపాటు తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాలను అతి భారీ వర్షాలు ముంచెత్తనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

చదవండి: కేరళ.. మాటిమాటికీ ఎందుకిలా..?

కేరళ మొన్నటి తుపాను దెబ్బకు ఎంతగా బేజారెత్తిపోయిందో అందరికీ తెలిసిన విషయమే. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు 350 మందికి పైగా ప్రజలు మరణించగా దాదాపు 30 వేల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ఆ బీభత్సం నుంచి పూర్తిగా కోలుకోకమునుపే మళ్లీ తాజా తుపాను హెచ్చరికలు కేరళవాసులను తీవ్రం భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

మూడు జిల్లాలకు పొంచి ఉన్న ప్రమాదం…

ఈ నేపథ్యంలో కేరళ సీఎం పినరయి విజయన్ సముద్రతీరంలోని మూడు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అంతేకాదు, ఇప్పటికే ఈ విషయమై ఆయన కేంద్ర ప్రభుత్వంతో చర్చించి.. పోయినసారిలాగే మళ్లీ పెద్ద ఎత్తున వరదలు గనుక కేరళను ముంచెత్తితే తక్షణమే సహాయక చర్యలు చేపట్టేందుకు తమ రాష్ట్ఱానికి కేంద్ర బలగాలను పంపించాలని కూడా కోరారు.

చదవండి: సుప్రీం మరో సంచలన తీర్పు: శబరిమల ఆలయంలోకి స్త్రీలు కూడా ప్రవేశించవచ్చు..

బుధవారం కేరళ ఉన్నతాధికారులతో కూడా సీఎం విజయన్ సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. చేపల వేట కోసం ఎవరూ తీర ప్రాంతాలకు వెళ్లవద్దని సూచిస్తూ.. రెడ్ అలర్ట్ ప్రకటించిన మూడు జిల్లాల్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

- Advertisement -