
రాజస్థాన్ : ఈ మధ్య కాలంలో మన దేశంలో కూడా పాశ్చత్య సంస్కృతీ ఎక్కువైపోతోంది. విదేశాలలో ఉన్నట్టుగా విచ్చలవిడి తనం రోజు రోజుకి ఎక్కువైపోతోంది.ఇందులో భాగంగా తాజాగా రాజస్థాన్‌లో ఓ కేసు విషయంలో అక్కడి హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అసలు విష్యం ఏమిటంటే ఓ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నవివాహిత మహిళా, సహ ఉపాధ్యాయుడు బలరాంతో ఐదేళ్లుగా సహజీవనం చేస్తోంది.
ఆమెను బాగా ఇష్టపడిన బలరాం, నువ్వు నాకు బాగా నచ్చావ్. నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చాడు. ఆ మాట నమ్మిన ఆమె ఇంట్లో భర్త, స్కూల్లో బలరాం, ఇద్దరితోనూ కాపురం చెయ్యలేక, భర్తను వదిలిపెట్టింది. విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత బలరాం ఆమెను పెళ్లి చేసుకుని ఉండి వుంటే… ఈ కేసు తెరపైకి వచ్చేది కాదు. కానీ బలరాం ఆమెకు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. కలలో కూడా ఊహించని ట్విస్ట్ అది.
బలరామ్ పెద్ద ఖతర్నాక్. అతనికి ఐటీ విభాగంలో జాబ్ వచ్చింది. అందులో చేరాడు. శాలరీ పెరిగింది. లైఫ్ స్టైల్ ఒక్కసారిగా మారిపోయింది. దాంతో ఊర్మిళ అతనికి చేదు అయ్యింది. ఐటీలో మరో అమ్మాయిని వల్లో వేసుకున్నాడు. అక్కడ కూడా అవే మాటలు చెప్పాడు. నువ్వంటే ఇష్టం, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అతని చరిత్ర తెలియని అవతలి అమ్మాయి పెళ్లికి రెడీ అయిపోయింది. మరి ఊర్మిళ పరిస్థితేంటి ఆమె జీవితం ఏం కావాలి.
బలరాం లాంటి వాళ్లను ఊరికే వదలకూడదు అనుకున్న ఊర్మిళ… రాజస్థాన్ హైకోర్టులో కేసు వేసింది. హైకోర్టు కేసును విచారించింది. బలరాంకి షాక్ కొట్టే తీర్పు ఇచ్చింది. సహజీవనం చేయడమంటే భారత సమాజంలో పెళ్లి చేసుకున్నట్లేననీ, సమాజం దాన్ని వివాహంగానే తప్ప మరోవిధంగా పరిగణించదు అని రాజస్థాన్ హైకోర్టు అభిప్రాయపడింది.
కొన్ని రోజులు ఒక అమ్మాయితో సహజీవనం చేసి, తర్వాత మరో యువతితో పెళ్లికి సిద్ధమైన బలరాం ప్రయత్నాలకు కోర్టు బ్రేక్ వేసింది. అలా బలరాం తిక్క కుదిర్చింది.వివాహేతర సంబంధాన్ని సుప్రీంకోర్టు సమర్ధించినా, నిజానికి ఇలాంటి సంబంధాలతో అన్నీ అనర్థాలే జరుగుతున్నాయి.
సాఫీగా సాగే సంసారంలో ఈ వివాహేతర సంబంధాలు నిప్పులు పోస్తున్నాయి. లేనిపోని నేరాలకు దారి తీస్తున్నాయి. ఈ కేసులో ఊర్మిళ జీవితంలోకి బలరాం రాకపోయి ఉంటే, ఆమె తన భర్తతో జీవించేదే. ఇప్పుడామెకు భర్త లేడు. బలరాంతో మనస్శాంతిగా జీవించే పరిస్థితీ లేదు.








