26.2 C
Hyderabad
Saturday, September 19, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ పీకే పై భారీ ఆశలు పెట్టుకున్న మూడు ప్రధానపార్టీలు!గెలిచేదెవరు? ఓడేదెవరు?

పీకే పై భారీ ఆశలు పెట్టుకున్న మూడు ప్రధానపార్టీలు!గెలిచేదెవరు? ఓడేదెవరు?

PK Latest News, AP Latest Election News, AP Political Updates, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఏపీలో పోలింగ్‌ గతనెల 11న ముగిసింది. మరో 15 రోజుల్లో ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఫలితాల కోసం పోటీ చేసిన అభ్యర్థులతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఫలితాలు ఎలా ఉంటాయో అని ప్రధాన పార్టీల నాయకులు ఐవీఆర్‌ఎస్‌ ద్వారా సర్వేలు కూడా చేశారు. ఎన్నడూ లేని విధంగా పోలింగ్ కి , ఫలితాల వెల్లడికి మధ్య చాలా సమయం ఉండటంతో అందరూ అతృతతో ఎదురుచూస్తున్నారు.

23న వెలువడే ఫలితాల్లో టీడీపీ ప్రభంజనం సృష్టించబోతోంది అని టీడీపీ నేతలు అంటుంటే , వైసీపీ జోరుకి బ్రేకులు లేవు అధికారం తమదే అని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య పందాలు జోరందుకున్నాయి. కొంతమంది అప్పులుచేసి మరీ బెట్టింగ్‌లకు దిగుతుండడం విశేషం.

ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల జాతకాలు తెలుసుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు పోలింగ్‌ కేంద్రాల వారీ సర్వేలు నిర్వహిస్తున్నారు. అలాగే గ్రామాలు, వార్డుల్లో పట్టున్న నాయకులు పార్టీకోసం ఏమేరకు పనిచేశారో కూడా తెలుసుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గ ముఖ్య నాయకుడు, ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.

వారందరికీ విజయం మనదే అని భరోసా కల్పించారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వెన్నుపోటు పొడిచిన వారి లెక్కలు సరిచేస్తున్నారు. అలాగే జగన్ , పవన్ కూడా అభ్యర్థులతో , పార్టీ సీనియర్ నేతలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ఫలితాలు ఎలా రాబోతున్నాయి ఒక అంచనాకి వస్తున్నారు.

చదవండి:   దేవుడా…ఈ సర్వే ఎవరు ఊహించరు…ఏపీలో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయంటే?

ఇక ఆశలు విషయానికొస్తే…ఈ ఎన్నికలలో మూడు పార్టీలలో ఏ పార్టీ విజయం సాధించినా ..ఆ పూర్తి క్రెడిట్ మాత్రం పీకే కి పోతుంది. అదేంటి వైసీపీ గెలిస్తే పీకే క్రెడిట్ ఉంటుంది కానీ ,టీడీపీ , జనసేన గెలిచినా కూడా పీకే కి క్రెడిట్ ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా. ఇక్కడే ఆశలు ట్విస్ట్ పీకే అంటే ప్రశాంత్ కిషోర్ అనే కాదు.

టీడీపీ కి పీకే అంటే పసుపు కుంకుమ , వైసీపీ కి పీకే అంటే ప్రశాంత్ కిషోర్, జనసేన కి పీకే అంటే పవన్ కళ్యాణ్. టీడీపీ నాయకులు ఈ పీ.కే పైనే ఆశలు పెట్టుకోవడం విశేషం. ఈ ఐదేళ్ల పాలనలో వందకుపైగా సంక్షేమ పథకాలు అమలు చేసిన టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు పారదర్శక పాలన, రాష్ట్రాభివృద్ధితో పాటు మూడు నెలల కిందట అమలు చేసిన పసుపు కుంకుమపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు.

ఇక పతిపక్షం వైసీపీ రాజకీయ సలహాదారు ప్రశాంత్‌ కిషోర్‌ (పీకే)పై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఆయన వేసిన పాచికలు పారాయని, జగన్‌ పార్టీ గెలుస్తుందని ఆశలు పెట్టుకున్నారు. ఆ ధీమాతోనే పందాలు కడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీచేసిన జనసేన పార్టీ నాయకులు కూడా పార్టీ అధ్యక్షుడు పీకే (పవన్‌ కళ్యాణ్‌)పైనే ఆశలు పెట్టుకున్నారు.

ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ప్రత్యామ్నాయ రాజకీయం కోసం పవన్‌ కల్యాణ్‌ పార్టీకి ఓటేశారని ఎన్నికల్లో పోటీచేసిన జనసేన అభ్యర్థులు పీకేపై ఆశలు పెట్టుకున్నారు.

చూడాలి మరీ ఈ ఎన్నికలలో పీకే ఎవరిని అందలం ఎక్కిస్తుందో… ఏ పార్టీ నాయకుల ఆశలు తీరుతాయో తేలాలంటే మరో 15రోజులు వేచిచూడక తప్పదు.

చదవండి:  ఏపీలో వైరల్ అవుతున్న లేటెస్ట్ సర్వే! వైసీపీకి 110 సీట్లు ఖాయమట!
- Advertisement -