అవతార్-2 రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన జేమ్స్ కామెరూన్!

Avatar 2 Movie News, James Cameron Latest News, Hollywood News, Newsxpressonline
- Advertisement -

హైదరాబాద్: హాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ 2009లో తెరెక్కించిన అవతార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది.  సహజవనరుల కోసం మనుషులు పాండోరా గ్రహానికి వెళ్లడం, అక్కడ నావీ అనే జాతికి చెందిన జీవులతో యుద్ధం, ఆ తరువాత వారికి హీరో సాయం చేయడం వంటి ఆసక్తికరమైన మలుపుతో ఈ అవతార్ సినిమాను కామెరూన్ అద్భుతంగా తెరకెక్కించాడు.

అలాగే ఈ అవతార్ సినిమాకి కొనసాగింపుగా మరో 4 సీక్వెల్స్ ఉంటాయని అప్పట్లోనే ప్రకటించాడు డైరెక్టర్ కామెరూన్. తాజాగా అవతార్-2 రిలీజ్ డేట్ ని ఆయన ప్రకటించారు. 2021, డిసెంబర్ 17న తాము అవతార్-2ను రిలీజ్ చేస్తామని కామెరూన్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో ప్రకటించారు.

అలాగే ఈ సినిమాకు టైటిల్ ను కామెరూన్ ప్రకటించనప్పటికీ..‘అవతార్.. ది వే ఆఫ్ వాటర్’ అనే పేరును ఖరారు చేయవచ్చని హాలీవుడ్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ సినిమా ప్రధానంగా పాండోరా గ్రహంపై ఉన్న సముద్రాలపై ఉంటుందని పేర్కొన్నాయి. అవతార్-1 సినిమాను రూ.1,648 కోట్లతో తెరకెక్కించగా, ఏకంగా రూ.రూ.20,455 కోట్ల కలెక్షన్లు సాధించి చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఈ రికార్డ్ అందుకోలేకపోయాయి.

చదవండి:  మహర్షి ఫస్ట్ రివ్యూ ! బొమ్మ బ్లాక్ బ్లాస్టర్!
- Advertisement -