‘లాక్‌డౌన్’ పొడిగింపుపై క్లారిటీ.. సీఎంలతో నేడు ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్…

lockdown-likely-to-be-extended-pm-modi-suggests-at-all-party-meeting
- Advertisement -

న్యూఢిల్లీ: ఈ నెల 14తో ముగియనున్న లాక్‌డౌన్‌ను మరింత కాలం పొడిగించే అవకాశం ఉందన్న ఊహాగానాలకు శనివారంతో తెరపడనుంది. 

21 రోజుల లాక్‌డౌన్ గడువు మంగళవారంతో ముగియనుంది. కరోనా కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకు మరింత పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం ఉందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి.

పొడిగింపు ఉంటుందా? లేదా?

పొడిగింపు ఉంటుందా? లేదా? అన్న విషయమై నేడు ఓ క్లారిటీ రానుంది. ప్రధాని నరేంద్రమోడీ శనివారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో లాక్‌డౌన్ పొడిగింపుపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.

ఒకవేళ లాక్‌డౌన్‌ను పొడిగించే పక్షంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలను కొంతమేర సడలించే అవకాశం ఉందని తెలుస్తోంది. కొన్ని రంగాలను లాక్‌డౌన్ నుంచి మినహాయిస్తారని సమాచారం.

చదవండి: కరోనా లాక్‌డౌన్: అమితాబ్ ఇంట్లో మల్టీస్టారర్ చిత్రం.. పేరు ‘ఫ్యామిలీ’, ఎవరు నటించారంటే..
- Advertisement -