29.2 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం అమెరికాలో అల్లకల్లోలం.. మరణిస్తున్న వారిలో సగం మంది న్యూయార్క్‌ వాసులే!

అమెరికాలో అల్లకల్లోలం.. మరణిస్తున్న వారిలో సగం మంది న్యూయార్క్‌ వాసులే!

- Advertisement -

వాషింగ్టన్: కోవిడ్-19 విసిరిన పంజాకు అమెరికా అల్లకల్లోలం అవుతోంది. ఆ దేశంలో ప్రతి రోజు వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. బుధవారం 1973 మంది కరోనా కాటుకు బలవగా, గురువారం 1783 మంది ప్రాణాలు విడిచారు. నిన్న రాత్రి 11 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 1309 మంది చనిపోయారు.

చదవండి: అయ్యో అమెరికా.. 4.7 కోట్ల ఉద్యోగాలకు ఎసరు!

ఫలితంగా కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య అమెరికాలో 18 వేలు దాటింది. ఇప్పటి వరకు 4.8 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

న్యూయార్క్‌లో పరిస్థితులు మరింత దారుణం…

న్యూయార్క్‌లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. అక్కడ నిన్న ఒక్క రోజే 777 మంది మృతి చెందారు. దీంతో ఒక్క న్యూయార్క్‌లోనే ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,800 దాటిపోయింది. ప్రపంచంలోని ఇతర దేశాల్లో నమోదైన మరణాల కంటే ఒక్క న్యూయార్క్‌లోని మరణాల సంఖ్యే ఎక్కువ కావడం గమనార్హం.

కేసుల సంఖ్య కూడా న్యూయార్క్‌లోనే అధికం. కరోనాకు బలైన వారి మృతదేహాలను తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో అధికారులే సామూహిక ఖననాలు జరిపిస్తున్నారు.

చదవండి: కరోనాను జయించిన బ్రిటన్ ప్రధాని.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

స్థానికంగా ఉన్న హార్ట్ దీవిలో తవ్విన భారీ గుంతలో శవాలను పూడ్చిపెడుతున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -