21.7 C
Hyderabad
Friday, November 6, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం మోడీ సారథ్యంలో చివరి కేబినెట్ భేటీ, ఎన్నికల వేళ వరాల జల్లు కురిపిస్తారా?

మోడీ సారథ్యంలో చివరి కేబినెట్ భేటీ, ఎన్నికల వేళ వరాల జల్లు కురిపిస్తారా?

narendra modi, modi last cabinet meet, Newsxpressonline
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో గురువారం చివరి కేబినెట్‌ సమావేశం జరగనుంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ వెలువడనున్న నేపథ్యంలో ప్రధాని మోడీ నివాసంలో జరిగే ఈ కేబినెట్‌ భేటీలో వరాల జల్లు కురిపించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

ఈనెల 9 లేదా 11న సార్వత్రిక ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించే లోగా మరికొన్ని వరాలతో దేశ ప్రజానీకాన్ని ఆకట్టుకోవాలని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం నాటి కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు ఉండవచ్చని సమాచారం.

ఉన్నత విద్యా సంస్థల్లో అగ్రవర్ణ పేదలకు 10 శాతం కోటా అమలుకు రూ.4000 కోట్ల అదనపు కేటాయింపులకు నేటి కేంద్ర కేబినెట్‌ సమావేశం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే అవకాశమున్నట్లు చెబుతున్నారు.

అలాగే యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీల రిజర్వేషన్‌లకు సంబంధించి 200 పాయింట్‌ రోస్టర్‌ వ్యవస్థ పునరుద్ధరణకు ఆర్డినెన్స్‌పై నిర్ణయం కూడా తీసుకోవచ్చని భావిస్తున్నారు.

ఈ చివరి కేబినెట్ భేటీలో మరిన్ని ప్రజాకర్షక వరాలనూ ప్రకటించి పూర్తిస్ధాయిలో ఎన్నికల రణరంగంలోకి దూకాలని మోడీ సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈరోజు కేబినెట్‌ భేటీ అనంతరం ప్రధాని మోడీ నాగపూర్‌ మెట్రో 13.5 కిలోమీటర్ల ఫేజ్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించనున్నారు.

- Advertisement -