26.4 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వైరల్ న్యూస్ 30 ఏళ్లుగా ఇంజిన్ ఆయిల్, టీ.. ఇవే ఇతడి ఆహారం!

30 ఏళ్లుగా ఇంజిన్ ఆయిల్, టీ.. ఇవే ఇతడి ఆహారం!

man-surviving-on-engine-oil-tea
- Advertisement -

బెంగళూరు: సాధారణంగా ఆకలైతే ఎవరైనా ఏం చేస్తారు? టిఫిన్ లేదా భోజనం చేస్తారు. కానీ ఓ వ్యక్తి ఆకలేసినప్పుడల్లా ఇంజిన్ ఆయిల్, టీ తాగుతున్నాడు. ఇదేదో ఒకరోజు రెండ్రోజులు కూడా కాదు. గత 30 ఏళ్లుగా అతడు ఇదే పనిచేస్తున్నాడు. ఈ విషయం తెలిసి.. పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని మహాలక్ష్మీ లేఅవుట్‌లో అయ్యప్ప స్వామి ఆలయంలో ఉంటోన్న కుమార్ అనే వ్యక్తి బుధవారం మధుగిరికి వచ్చాడు. అక్కడి బస్టాండ్‌లో అతడు ఒంటరిగా తిరుగుతుండడం గమనించిన స్థానికులు, ఆటో డ్రైవర్లు.. పలకరించగా ఆకలిగా ఉందని చెప్పడంతో వారు తినడానికి ఆహారం, నీళ్లు అందించారు.

అయితే అతడు తాను అవేవీ తిననని, ఇంజిన్ ఆయిల్, టీ కావాలని చెప్పాడు. అంతేకాదు, తాను చిన్నప్పట్నించీ అంటే గత 30 ఏళ్లుగా అవే తాగుతూ బతుకుతున్నానని కుమార్ చెప్పగా విని ఆశ్చర్యపోవడం వారి వంతైంది. ఒకసారెప్పుడో ఇలాగే అన్నం తిని నీళ్లు తాగితే.. నోటివెంట రక్తం పడిందని, దీంతో తాను అన్నం నీళ్లు మానేసి ఇంజిన్ ఆయిల్, టీ మీదే బతుకుతున్నానని అతడు వెల్లడించాడు.

 

- Advertisement -