అరిజోనా(అమెరికా): యజమాని స్పృహతప్పి పడిపోవడాన్ని అతడి చేతికున్న వాచ్ వెంటనే గుర్తించింది. తొలుత యజమానిని సృహలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది.
అతడు ఎంతకీ లేవకపోవడంతో వెంటనే తనంత తానుగా అత్యవసర సిబ్బందికి ఫోన్ చేసింది. అలా ఆ వాచ్ తన యజమాని ప్రాణాలు కాపాడింది.
వాచ్ కాపాడడమేంటని అనుకుంటున్నారా? అది సాదాసీదా వాచ్ కాదు మరి.. ‘యాపిల్ వాచ్’.
ఆపదలో చిక్కుకున్న వారిని యాపిల్ వాచ్ రక్షించిన ఘటనలు గతంలోనూ ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా.. అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో ఇలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
అరిజోనా కేటార్ రేడియోలో ఇందుకు సంబంధించిన వివరాలు తొలిసారిగా ప్రసారం అయ్యాయి. వివరాల్లోకి వెళితే..
అరిజోనాలో నివశించే ఓ వ్యక్తికి అనుకోకుండా గుండె నొప్పి వచ్చింది. అతడిని చుట్టుపక్కల కూడా ఎవరూ లేకపోవడంతో ఇక తన పని అయిపోయిందని అనుకున్నాడు.
కొంత సేపటికి స్పృహ కోల్పోయాడు. అయితే ఈ సమయంలోనే అతడి చేతికున్న వాచ్ యజమాని దుస్థితిని గుర్తించింది.అతడి రక్త ప్రసరణ వేగం పడిపోవడం, టెంపరేచర్ పెరగడం ఇటాంటి లక్షణాలను గుర్తించింది.
మొదట అతడికి స్పృహ తెప్పించేందుకు ప్రయత్నించింది. అయినా ఎటువంటి స్పందన లేకపోవడంతో వెంటనే అత్యవసర సర్వీసుల సిబ్బందికి సమాచారం అందించింది.
సిబ్బంది వెంటనే వచ్చి అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో అతడు ప్రాణాలు నిలబడ్డాయి.
ఈ సంఘటనకు సంబంధించి అత్యవసర సేవల సిబ్బంది మాట్లాడుతూ, ‘బాధితుడి కిందపడిపోయాడని, అతడికి చికిత్స అవసరమని మాకు ఫోన్ వచ్చింది.
ఎక్కడున్నదీ కూడా చెబుతూ యాపిల్ వాచ్ మాకు లోకేషన్ పంపించింది. ఘటన స్థలానికి తాము చేరుకునే వరకూ బాధితుడికి మేము వస్తున్నట్టే తెలియలేదు.
పరిస్థితులను బట్టి యాపిల్ వాచీ వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుని తమకు సమాచారం అందించింది’ అంటూ వైద్య సిబ్బంది యాపిల్ వాచీ పనితీరును ప్రశంసించారు.
తన ప్రాణాలను యాపిల్ వాచీ కాపాడిందని తెలిసిన ఆ వ్యక్తి ఎంతో సంతోషిస్తున్నాడు. యాపిల్‌కు కృతజ్ఞతలు చెబుతున్నాడు.
యాపిల్ వాచీలో 3 ముఖ్యమైన ఫీచర్లు…
నిలబడి ఉన్న మనిషి ఏకారణం చేతైనా ఒక్కసారిగా కుప్పకూలిపోతే వాచీ వెంటనే అప్రమత్తమై అత్యవసర సిబ్బందికి సమాచారం అందిస్తుంది.
వాచీ ధరించిన వ్యక్తి గుండె కొట్టుకునే తీరుపై కూడా ఈసీజీ ద్వారా గట్టి నిఘా పెడుతుంది.
గుండె పనితీరులో లోపం గుర్తించిన వెంటనే రక్షణ చర్యలను చేపడుతుంది. వైద్య సిబ్బంది వచ్చే వరకు లోకేషన్స్ పంపుతూ వారికి కనెక్టివిటీలో ఉంటుంది.
నేలకొరిగిన యజమాని ప్రాణాలు కోల్పోకుండా తీసుకోవాల్సిన చర్యలను కూడా తన పరిధిలో తీసుకుంటుంది.