రండి.. ప్రేమికుల దినోత్సవంలో పాల్గొనండి: ప్రధాని మోడీకి షహీన్‌బాగ్ నిరసనకారుల ఆహ్వానం!

pm-modi-invited-by-shaheen-bagh-protesters
- Advertisement -

న్యూఢిల్లీ: ‘ప్రేమికుల దినోత్సవం’లో పాల్గొనాలంటూ ప్రధాని నరేంద్రమోడీని షహీన్‌బాగ్ నిరసనకారులు ఆహ్వానించారు.

శుక్రవారం ‘వాలెంటైన్స్ డే’ సందర్భంగా ఓ ప్రేమగీతాన్ని ఆవిష్కరించనున్న నిరసనకారులు ఈ సందర్భంగా ప్రధాని కోసం ఓ గిఫ్ట్ కూడా సిద్ధం చేశారు. దీనిని తీసుకోవడానికి రావాలంటూ వారు మోడీని ఆహ్వానించారు. 

చదవండి: మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌కు కేంద్రం అరుదైన గౌరవం!

అంతేకాదు, ఇందుకు సంబంధించిన పోస్టర్లను నిరసన వేదిక వద్ద ఏర్పాటు చేశారు. ‘మోడీజీ షహీన్‌బాగ్ రండి.. మీ కోసం సిద్ధం చేసిన బహుమతిని తీసుకోండి.. మాతో మాట్లాడండి..’ అని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు.

రాజ్యాంగానికి వ్యతిరేకంగా తాము ప్రవర్తించడం లేదని పేర్కొన్న నిరసనకారులు అమిత్ షా సహా ఎవరైనా తమ వద్దకు వచ్చి మాట్లాడొచ్చన్నారు.

సీఏఏ, ఎన్నార్సీలపై తమను ఒప్పించగలిగితే తాము నిరసనలను ఆపేస్తామని ఈ సందర్భంగా నిరసనకారులు తెలిపారు. సీఏఏ వల్ల దేశానికి ఒనగూరే ప్రయోజనం గురించి ఒక్కరు కూడా మాట్లాడడం లేదన్నారు.

చదవండి: ఏపీ ‘మూడు రాజధానుల’పై షకీలా పంచ్.. వచ్చేసిన ట్రైలర్

నిరుద్యోగం, పేదరికం సహా దేశ ఆర్థిక మందగమనం వంటి పలు సమస్యలకు సీఏఏతో పరిష్కారం ఎలా లభిస్తుందో చెప్పాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

- Advertisement -