మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌కు కేంద్రం అరుదైన గౌరవం!

sushma swaraj photos
sushma swaraj latest news
- Advertisement -

న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత, కేంద్ర మాజీ మంత్రి దివంగత సుష్మ స్వరాజ్ జయంతి నేడు. ఆమె 68వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆమెకు అరుదైన గౌరవం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఢిల్లీలోని ప్రవాస భారతీయ కేంద్రం, ఫారిన్‌ సర్వీస్‌ ఇన్‌స్టిట్యూట్లకు గురువారం కేంద్రం సుష్మ పేరు పెట్టింది. ప్రవాస భారతీయ కేంద్రానికి ‘సుష్మా స్వరాజ్‌ భవన్‌’గా, ఫారిన్‌ సర్వీస్‌ ఇన్‌స్టిట్యూట్‌కు ‘సుష్మా స్వరాజ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ సర్వీస్’గా నామకరణం చేసింది.

రెండు ఇన్‌స్టిట్యూట్‌లకు సుష్మా పేరు…

మోడీ గత ప్రభుత్వంలో విదేశాంగశాఖ మంత్రిగా పనిచేసిన సుష్మ గుండెపోటు కారణంగా గతేడాది ఆగస్టు 6న కన్నుమూసిన సంగతి విదితమే. సుష్మ గౌరవార్థం ఈ రెండు ఇనిస్టిట్యూట్‌లకు తాజాగా ఆమె పేరు పెట్టినట్టు విదేశాంగ శాఖ తెలిపింది.

చదవండి: ఏపీ ‘మూడు రాజధానుల’పై షకీలా పంచ్.. వచ్చేసిన ట్రైలర్
చదవండి: మీకు దండం పెడతా.. మీ డబ్బు మీరు తీసుకోండి: భారత బ్యాంకులకు విజయ్ మాల్యా వేడుకోలు
- Advertisement -