జూన్ 17నుంచి పార్లమెంట్ సమావేశాలు…19న స్పీకర్ ఎన్నిక

- Advertisement -

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచిన ఎన్డీయే కేంద్రంలో రెండోసారి కొలువుదీరింది. గురువారం ప్రధాని మోడీతో సహ 57 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

ఈ నేపథ్యంలో మోడీ నేతృత్వంలోని నూతన మంత్రిమండలి శుక్రవారం తొలిసారి సమావేశమైంది.  ఆర్ధిక మంత్రి నిర్మలసీతరామన్ సహ 24మంది కేబినెట్‌ మంత్రులు, 9మంది స్వతంత్ర హోదా కల్గిన మంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

అలాగే పార్లమెంట్ సమావేశాల ఏర్పాటుపై కూడా నిర్ణయం తీసుకున్నారు. జూన్‌ 17 నుంచి జులై 26 వరకు పార్లమెంట్‌ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. జూన్ 17, 18న ఎంపీల ప్రమాణస్వీకారం ఉండనుంది.

అలాగే  జూన్‌ 19న లోక్‌సభ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. ఇక జూన్‌ 20న పార్లమెంట్‌ ఉభయ సభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగిస్తారు. అలాగే జులై 4న ఆర్థికసర్వే, జులై 5న కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.

చదవండి: కేంద్ర మంత్రులకు పదవులు ఖరారు:ఎవరికి ఏ శాఖ దక్కిందంటే?

- Advertisement -