22.8 C
Hyderabad
Sunday, November 8, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం అభినందన్ విడుదలపై పాక్ కొత్త నాటకం! ఇరు దేశాల మధ్య చర్చలు జరగాలంటూ మెలిక…

అభినందన్ విడుదలపై పాక్ కొత్త నాటకం! ఇరు దేశాల మధ్య చర్చలు జరగాలంటూ మెలిక…

abhinandhan
- Advertisement -

iaf-mirage-2000-fighter-jet-1, newsxpress.online

ఇస్లామాబాద్: పాకిస్తాన్ చెరలో ఉన్న భారత పైలట్ అభినందన్ విషయంలో ఆ దేశం సరికొత్త నాటకానికి తెరలేపింది. ఆయనను విడుదల చేయాలని తామూ భావిస్తున్నామని, కాకపోతే తమ ప్రధాని కోరినట్లు చర్చలకు అంగీకరిస్తే అభినందన్‌ను విడుదల చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సంకేతాలిస్తూ పాక్ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగింది.

అభినందన్ విడుదలపై పాకిస్తాన్ కొత్త వాదన…

పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మహ్ముద్ ఖురేషి తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు పాక్ వాదనను నిజం చేస్తున్నాయి.  ఖురేషి పాక్‌లోని ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ.. ‘ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడానికి భారత పైలట్ విడుదల నాంది పలుకుతుందని భావిస్తే అలానే చేస్తాం..’ అని  చెప్పారు.

అయితే.. ప్రధాని మోడీ చర్చలకు సిద్ధంగా ఉంటే తమ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా చర్చించడానికి సుముఖంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.  దీంతో యుద్ధ విమాన పైలట్ అభినందన్‌ను విడుదల చేయాలంటే భారత్-పాక్ నడుమ చర్చలు తప్పనిసరి అనే పాకిస్తాన్ వాదనకు ఆ దేశ విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు మరింత బలం చేకూరుస్తున్నాయి.

సంబంధిత వార్తలు

 

- Advertisement -