21.7 C
Hyderabad
Friday, November 6, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం శత్రువుకు లొంగదు.. పోరాటం ఆపదు: భారత్‌దే గెలుపంటూ మోడీ ప్రసంగం

శత్రువుకు లొంగదు.. పోరాటం ఆపదు: భారత్‌దే గెలుపంటూ మోడీ ప్రసంగం

narendra modi
- Advertisement -

narendra modi
న్యూఢిల్లీ: శత్రువు మనల్ని అస్థిరపర్చాలని ఎన్ని కుట్రలు చేసినా.. ఇండియా ఒక్కటిగా జీవిస్తుంది.. ఒక్కటిగానే పోరాడుతుంది.. ఒక్కటిగానే గెలుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని స్పష్టం చేశారు. సరిహద్దులో పాకిస్థాన్ చర్యల వల్ల అటు సైనికులకు గానీ, ఇటు దేశ ప్రజలకు గానీ ఆత్మస్థైర్యం ఏమాత్రం దెబ్బతినలేదన్నారు.

దేశ వ్యాప్తంగా 15వేల ప్రాంతాల నుంచి దాదాపు కోటి మంది బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులతో గురువారం ఆయన ప్రపంచంలోనే‘అతిపెద్ద వీడియో కాన్ఫరెన్స్‌’ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయన ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.

దేశ పౌరులు సైనికుల్లా అప్రమత్తంగా ఉండాలి

ఉగ్ర దాడుల ద్వారా భారత్‌ను విడగొట్టడానికి పాక్ ప్రయత్నిస్తోందని ప్రధాని మోడీ మండిపడ్డారు. ఇప్పుడు దేశ పౌరులందరూ సైనికుల్లా అలర్ట్‌గా ఉండాలని పిలుపునిచ్చారు.

‘పాక్ మనల్ని అస్థిర పరచడానికి చూస్తోంది. మన అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ, దేశమంతా ఇప్పుడు ఒక్కతాటిపైకి వచ్చి శత్రుదేశ దుష్ట ఆలోచనలను తిప్పి కొడుతోంది. ఇలాంటి సమయంలో భద్రతా బలగాల నైతిక స్థెర్యాన్ని దెబ్బ తీసేలా ఎవరూ వ్యవహరించకూడదు’ అని మోడీ వ్యాఖ్యానించారు.

‘2014 నుంచి 2019 వరకు అనుకున్న లక్ష్యాలను సాధించాం. 2024లోపు ప్రజల ఆకాంక్షలన్నింటినీ నెరవేర్చాల్సి ఉంది. ఈ ఐదేళ్లు దేశ ప్రజలకు ప్రాథమిక వసతులు కల్పించాం. వారి అవసరాలను తీర్చాం. ఇక రానున్న ఐదేళ్లు దేశం వేగంగా అభివృద్ధి చెందాల్సి ఉంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దడమే మా లక్ష్యం’ అని వ్యాఖ్యానించారు.

‘ప్రజల్లో మాపై చాలా నమ్మకం ఉంది. ప్రభుత్వ నూతన విధానాలతో దేశ ప్రజల్లో కొత్త ఉత్సాహం నిండింది. భాజపా బూత్‌ స్థాయి కార్యకర్తలకు నేను ఓ సూచన చేస్తున్నాను. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లండి. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించి చెప్పండి. మీరు మొదట మీ బూత్‌ స్థాయిలో ప్రజల మన్ననలు పొందితే.. దేశం కోసం కూడా పనిచేయగలరు. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న వారికి, ప్రతిపక్షాలకు మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. అలాగే, బూత్‌ స్థాయి కార్యకర్తల మధ్య కూడా ఇదే విధమైన పోటీ ఉండాలి. కార్యకర్తలే మన పార్టీకి వెన్నుముక’ అని మోదీ అన్నారు.

చదవండి: పాక్‌లో అభినందన్ పడిపోయాక జరిగింది ఏమిటో తెలుసా! పాక్ పత్రిక సంచలన వ్యాఖ్యలు!

- Advertisement -