పాకిస్తాన్ మరో కవ్వింపు చర్య.. భారతలోకి రహస్యంగా చాపర్ ద్వారా…

Pakistan-Air-Chopper
- Advertisement -

Pakistan Air Chopper

జమ్మూ కశ్మీర్: పాకిస్తాన్‌కు చెందిన ఓ చాపర్ ఆదివారం మధ్యాహ్నం భారత గగనతలంలోకి ప్రవేశించింది.  పూంచ్ సెక్టార్ వద్దగల నియంత్రణ రేఖను దాటి భారత గగనతలంలోకి వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం 12.10 గంటలకు పాకిస్తాన్‌కు చెందిన తెల్ల చాపర్ 1991 నాటి ద్వైపాక్షిక ఒప్పందం నిబంధనలను అతిక్రమించి భారత్‌లోకి వచ్చిందని భారత్‌ రక్షణ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ ప్రకటించారు.

ఆ చాపర్ పాకిస్తాన్‌కు వెళ్లే ముందు ఈ చాపర్ జమ్మూ కశ్మీర్ లోని కృష్ణ ఘాటీ సెక్టార్ వద్ద వాస్తవాధీన రేఖ దగ్గర చక్కర్లు కొట్టింది. చాపర్ ప్రవేశించిన వీడియోను న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ట్వీట్ చేసింది. గత ఫిబ్రవరిలో కూడా నియంత్రణ రేఖకు 300 మీటర్ల దూరంలో పాక్ చెందిన చాపర్ ఇలాగే చక్కర్లు కొట్టింది.

1991 నాటి ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం నియంత్రణ రేఖ వెంబడి బఫర్ జోన్‌గా ప్రకటించారు. ఒక దేశానికి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ మరో దేశ గగనతలానికి 1 కి.మీ. దూరంలో ఎగరడం నిషిద్ధం. బాంబర్లు, ఫైటర్లు లాంటి విమానాలు ఇతర దేశ ఏరోస్పేస్‌కు పది కిలో మీటర్ల లోపు దూరంలో ఎగరడం అనేది నిషిద్ధం.

భారత గగనతలంలోకి ప్రవేశించిన పాకిస్తాన్‌ చాపర్‌ని కూల్చివేసేందుకు భారత సైన్యం ప్రయత్నించినట్టు తెలుస్తోంది.

- Advertisement -