23.4 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేడు మళ్లీ ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్…

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేడు మళ్లీ ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్…

- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోడీ నేడు(గురువారం) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆయన ఈ సందర్భంగా సమీక్షిస్తారు.

దేశ వ్యాప్తంగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా వైరస్‌పై పోరాడేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు గత నెల 20న సీఎంలతో మోడీ సమావేశమయ్యారు.

చదవండి: కరోనా బాధితులకు వైద్యం చేస్తూ మరణిస్తే రూ.కోటి: కేజ్రీవాల్

కరోనా వైరస్ అన్ని రాష్ట్రాలకు వ్యాపించే అవకాశం ఉన్నందున ఈ మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

కరోనా సవాలును ఎదుర్కొనేందుకు దేశ ప్రజల సహకారం చాలా అవసరమని, అనవసర భయాందోళనలకు గురికావద్దని కోరారు.

ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రాణాంతక వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోడీ సూచించారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1637 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఇవాళ వెల్లడించింది.

చదవండి: ఉత్తరప్రదేశ్‌లో ఆగని కరోనా కేసులు.. వంద దాటిన వైనం!
- Advertisement -