24.2 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ షూటింగ్ కోసం వెళ్లి ఎడారిలో చిక్కుకున్న హీరో.. రక్షించమంటూ వేడుకోలు

షూటింగ్ కోసం వెళ్లి ఎడారిలో చిక్కుకున్న హీరో.. రక్షించమంటూ వేడుకోలు

- Advertisement -

తిరువనంతపురం: మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ హీరోగా బ్లెస్సీ ద‌ర్శ‌కత్వంలో “ఆడుజీవితం” అనే సినిమా తెరకెక్కుతోంది.

మొన్నటివరకు ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ జోర్డాన్‌లో జరిగింది. క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో షూటింగ్ ఆపేయాల‌ని అక్కడి అధికారులు ఆదేశించారు.

చదవండి: ప్రభాస్ కోసం అన్నపూర్ణ స్టూడియోలో మూడు భారీ సెట్లు

అయితే వెన‌క్కి వ‌చ్చి, మ‌ళ్లీ చిత్రీక‌ర‌ణ జరపడమంటే మాటలు కాదు. నిర్మాతకు ఖ‌ర్చు పెరిగిపోతుందని భావించిన చిత్ర యూనిట్ కొన్ని రోజుల తర్వాత షూటింగ్ చేసుకుందామని అక్కడే ఉండిపోయింది.

మొదట ఏప్రిల్ 10 వ‌ర‌కు షూటింగ్ చేసుకోవడానికి జోర్డాన్ అధికారుల నుంచి అనుమతి తీసుకున్నారు. ముందు ఆమోదం తెలిపిన అధికారులు కరోనా కారణంగా ప‌రిస్థితులు ఒక్కసారిగా మారిన నేపథ్యంలో ఆ అనుమతి రద్దు చేశారు.

దీంతో ఈ చిత్ర బృందం సభ్యులు 58 మంది జోర్డాన్ ఎడారిలో చిక్కుకుపోయారు. ఎలాగైనా తమకు సాయం చేయాలని దర్శకుడు బ్లెస్సీ కేరళ ప్రభుత్వానికి, ఫిల్మ్ ఛాంబర్‌కు లేఖ రాశాడు.

చదవండి: కరోనాపై కోటి సాంగ్.. అభినయించిన చిరు, నాగ్, వరుణ్ తేజ్, సాయితేజ్

తినడానికి తిండి, తాగడానికి నీరు సైతం అందుబాటులో లేవని, కేర‌ళ‌కు తిరిగి వ‌ద్దామ‌న్నా విమానాల రాక‌పోక‌లు నిలిచిపోయాయంటూ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు.

ప్ర‌భుత్వ సాయం లేనిదే కేర‌ళ‌కు రావ‌డం దాదాపు అసాధ్య‌మ‌ని వాపోయాడు. తమను రక్షించాలని అభ్య‌ర్థించాడు. తాజాగా నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా సోషల్ మీడియాలో ఓ లేఖను షేర్ చేశాడు.

- Advertisement -