26.2 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం అనుకున్నంతా అయింది: కాంగ్రెస్‌కు జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా, ప్రధానితో భేటీ…

అనుకున్నంతా అయింది: కాంగ్రెస్‌కు జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా, ప్రధానితో భేటీ…

Jyotiraditya-Scindia
Jyotiraditya Scindia Tendered Resignation
- Advertisement -

భోపాల్‌: అనుకున్నంతా అయింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అసంతృప్త నేత, మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా తన రాజీనామా అస్త్రంతో సొంత పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు. 

పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్న ఆయన.. ఆ మేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు. 

చదవండి: దిగ్విజయ్‌తో కమల్‌నాథ్ భేటీ.. సంక్షోభ నివారణపై చర్చ

రాజీనామా చేయడానికి ముందు సింధియా.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో కలిసి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. దీంతో ఆయన బీజేపీలో చేరతారని సాగుతున్న ఊహాగానాలకు మరింత ఊతం దొరికినట్లయింది. 

మరోవైపు, జ్యోతిరాదిత్య సింధియా రాజీనామాతో మధ్య ప్రదేశ్‌లోని కమల్‌నాథ్ ప్రభుత్వం మరింత ఇరకాటంలో పడింది. ఎందుకంటే సింధియా చేతిలో మరో 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

సీనియర్లతో కమల్‌నాథ్ మంతనాలు…  

ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ తన నివాసంలో పార్టీ సీనియర్‌ నేతలతో అత్యవసరంగా భేటీ అయ్యారు. 

ఇక, కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ కూడా సమావేశమయ్యారు. మధ్యప్రదేశ్‌లో తాజా పరిణామం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వీరు భేటీ అయినట్లు తెలుస్తోంది. 

మరోవైపు భోపాల్‌లో బీజేపీ సీనియర్‌ నేతల సమావేశం జరుగుతోంది. మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, సీనియర్‌ నేతలు వీడీ శర్మ, వినయ్‌ సహస్రబుద్ధి కీలక భేటీ నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు భోపాల్‌లో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం కూడా జరగనుంది. 

Scindia Resignation Letter

- Advertisement -