దేశంలో ఒక్క రోజులోనే రెండు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు.. రికార్డు బద్దలు

- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు మరింతగా చెలరేగిపోతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గత రికార్డులను చెరిపివేస్తూ నేడు ఏకంగా రెండు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. దేశంలో నేడు కొత్తగా 2,00,739 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,40,74,564కి చేరింది.

ఇందులో 1,24,29,564 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 14,71,877 కేసులు క్రియాశీలంగా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 93,528 మంది కోలుకున్నారు.

అలాగే, దేశంలో గత 24 గంటల్లో కరోనాతో 1038 మంది మృతి చెందారు. దీంతో కరోనా బారినపడి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,73,123కి చేరింది.

 

- Advertisement -