25.1 C
Hyderabad
Tuesday, October 13, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం పాక్‌పై వైమానిక దాడిలో హైదరాబాదీ పైలట్! మిరాజ్ పైలట్లకు సిటీలోనే శిక్షణ?

పాక్‌పై వైమానిక దాడిలో హైదరాబాదీ పైలట్! మిరాజ్ పైలట్లకు సిటీలోనే శిక్షణ?

surgical strike 2.0
- Advertisement -

mirage pilots

హైదరాబాద్‌: నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్‌లోని జైషే ఉగ్రవాదుల స్థావరాలపై మంగళవారం తెల్లవారుజామున భారత వాయుసేన బాంబుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో కీలక పాత్ర పోషించిన మిరాజ్ యుద్ధ విమానాలను నడిపిన భారత వాయుసేన పైలట్ల ధైర్య సాహసాలపై దేశ ప్రజల నుంచి సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోకి ప్రవేశించి లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసి సురక్షితంగా వెనక్కి రావడంపై వారి సాహసాన్ని కొనియాడుతున్నారు. కాగా, మిరాజ్ యుద్ధ విమానాలను నడిపిన పైలట్లకు హైదరాబాద్‌లోని దుండిగల్, హకీంపేట కేంద్రాల్లోనే ప్రాథమిక శిక్షణ ఇవ్వడం గమనార్హం. 1967లో స్థాపించబడిన దుండిగల్ అకాడమీ గత 50 ఏళ్లుగా యుద్ధ విమాన పైలట్లకు శిక్షణనిస్తోంది.

వైమానిక దాడిలో హైదరాబాదీ పైలట్..

అంతేగాక, యుద్ధ విమానాలు నడిపిన వారిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన పైలట్‌ ఉన్నారని మంగళవారం ప్రచారం జరిగింది. ఈ మేరకు కొన్ని మీడియా ఛానళ్లలో స్క్రోలింగ్‌ రావడంతో చర్చనీయాంశంగా మారింది.

అయితే ఆ పైలట్‌ ఎవరనేది నిర్ధారణ కాలేదు. హైదరాబాద్‌లోని రక్షణశాఖ వర్గాలు కూడా ఈ విషయంపై స్పష్టతనివ్వలేదు. వైమానిక దాడిలో హైదరాబాద్ కు చెందిన పైలట్ పాల్గొన్నప్పటికీ అందుకు సంబంధించిన సమాచారం వెల్లడించడం సాధ్యం కాదని పేర్కొన్నాయి.

సంబంధిత వార్తలు

- Advertisement -