26.2 C
Hyderabad
Saturday, September 19, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం సీబీఐ అధికారుల తీరుకు నిరసనగా సీఎం మమత దీక్ష! దీదీకి చంద్రబాబు వత్తాసు…

సీబీఐ అధికారుల తీరుకు నిరసనగా సీఎం మమత దీక్ష! దీదీకి చంద్రబాబు వత్తాసు…

mamata-banerjee_ dharna
- Advertisement -

mamata-banerjee_ dharna

కోల్‌కతా పోలీసు కమిషనర్ ఇంటికి సీబీఐ అధికారులు రావడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సీరియస్ అయ్యారు. బీజేపీ తమను వేధిస్తోందని మండిపడుతూ కోల్‌కతాలోని మెట్రో ఛానల్‌ వద్ద ఆమె ధర్నాకు దిగారు.

శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసులో ప్రమేయముందన్న ఆరోపణలపై కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను అదుపులోకి తీసుకునేందుకు ఆదివారం సీబీఐ అధికారులు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే, సీబీఐ అధికారులను అదుపులోకి తీసుకొని పోలీసులు నిలదీశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ధర్నాకు దిగిన మమత మాట్లాడుతూ తన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఇది రాజ్యాంగంపై దాడి అని ఆమె  పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకే తాను ధర్నాకు దిగానన్నారు.

పశ్చిమ బెంగాల్ లో ఉద్రిక్తత..

రాష్ట్ర బడ్జెట్‌ను ధర్నా ప్రదేశం నుంచే ప్రవేశపెడతానని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అద్యక్షుడు అమిత్ షాలపై మండిపడ్డారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సీబీఐకి ఆదేశాలిచ్చి, పశ్చిమ బెంగాల్‌కు పంపించారని వెల్లడించారు. పోలీసులపై చర్యలకు తెగబడటం దారుణమని అన్నారు.

మరోవైపు మమతా బెనర్జీ చేపట్టిన ఈ ధర్నాకి ఏపీ సీఎం చంద్రబాబు మద్దతు తెలిపారు. అవసరమైతే మమతాకి తమ సహాయం అందిస్తామని కూడా పేర్కొన్నారు.

చదవండి : దీదీకి భయమెందుకో అర్థమైంది: బెంగాల్‌లో మమతకు మోడీ చురకలు, సభలో స్వల్ప తొక్కిసలాట

- Advertisement -