

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అత్యంత భారీ బడ్జెట్‌తో సైరా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా నయనతార నటిస్తోంది. ఇక ఇందులో ఒక ముఖ్యమైన పాత్రకు తమన్నాను తీసుకున్నారు. తాజాగా మరో ప్రత్యేకమైన పాత్ర కోసం అనుష్క ఎంపిక అయినట్లు తెలుస్తోంది.
కీలకపాత్రలో అనుష్క..
సైరాలో ఒక బరువైన ప్రత్యేక పాత్ర ఉందట. ఈ పాత్రను అనుష్క చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని సురేందర్ రెడ్డి వ్యక్తం చేయడంతో, చరణ్ స్వయంగా అనుష్కతో మాట్లాడి ఆమెను ఒప్పించినట్టుగా ఫిల్మ్ నగర్‌లో చెప్పుకుంటున్నారు.
గతంలో అనుష్క ప్రత్యేకమైన పాత్రలను చేసింది. అయితే తనకి తొలి ఛాన్స్ ఇచ్చిన నాగార్జున మాట కాదనలేక.. ఆమె ఆయన సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపించింది. అలాంటిది ‘సైరా’ సినిమాలో ప్రత్యేక పాత్రను చేయడానికి అనుష్క ఒప్పుకుంటుందా? మరి ఈ వార్తలో నిజమెంతో చూడాలి.
చదవండి : ‘సైరా’ చిత్ర బృందానికి షాక్.. కథానాయకుడి ఇంటి సెట్‌ను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు!








