

టీం ఇండియా ప్రారంభంలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది, ఆ సమయంలో ఆదుకుంటాడనుకున్న ధోనీ ఒక్క పరుగుకే బౌల్డ్ అయ్యాడు. దీంతో మళ్ళీ నాలుగో వన్డేలాగే మరో దారుణ పరాజయం ఖాయమేనని అంతా భావించారు.
కానీ ఈసారి జట్టు మిడిలార్డర్ కాపాడింది. కొన్ని రోజులుగా తన అట తీరుతో అబ్బుర పరుస్తున్న అంబటి రాయుడు మరోసారి అదిరే ఆటను ప్రదర్శించగా.. వన్డేల్లో ‘తొలిసారి’ బ్యాటింగ్‌కు దిగిన విజయ్ శంకర్‌తోపాటు కేదార్ జాదవ్ అతడికి సహకారం అందించారు.
హార్దిక్ పాండ్య సిక్సర్ల మోత…
ఇక చివర్లో హార్దిక్ పాండ్యా సిక్సర్ల మోత మోగించడంతో జట్టును పటిష్ఠ స్థితిలో నిలిపాడు. ఆ తర్వాత బౌలర్లు ఎప్పటిలాగే ప్రత్యర్థిని చాపచుట్టేయడంతో కివీస్ గడ్డపై తొలిసారి టీమిండియా 4-1తో సిరీస్‌ను దక్కించుకుంది.
బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌పై ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. హామిల్టన్ పిచ్ మాదిరే ఇక్కడా బంతి స్వింగ్ కావడంతో కివీస్ పేస్ ద్వయం హెన్రీ నికోల్స్, ట్రెంట్ బౌల్ట్ చెలరేగారు. 18 పరుగులకే రోహిత్ (2), ధవన్ (6), గిల్ (7), ధోనీ (1) పెవిలియన్‌కు చేరారు. ఏడో ఓవర్‌లోనే క్రీజులోకి వచ్చిన ధోనీ.. బౌల్ట్ అద్భుత బంతికి క్లీన్‌బౌల్డయ్యాడు.
ఆ తరువాత రాయుడు, పాండ్య పాతుకుపోయి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ని అందించారు.








