కర్ణాటక సమరం : కుమారస్వామి, యడ్యూరప్ప.. ఏకగ్రీవ ఎన్నిక, ముఖ్యమంత్రి పీఠం ఎవరిదో?

- Advertisement -

బెంగళూరు: కర్నాటకలో ఎవరు సీఎం అవుతారో ఇంకా టెన్షన్‌గానే ఉంది. అయితే ఇవాళ రెండు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. జేడీఎస్ ఎల్పీ నేతగా హెచ్‌డీ కుమారస్వామి ఎన్నికయ్యారు. బెంగళూరులో జరిగిన జేడీఎస్ మీటింగ్‌లో కుమారస్వామిని పార్టీ చీఫ్‌గా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ నేత మంజూనాథ్ తెలిపారు. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, కుమారస్వామే సీఎం అవుతారని ఆయన చెప్పారు. తమపై ఎవరి ప్రభావం ఉండదన్నారు.

మరోవైపు బీజేపీ కూడా తమ పార్టీ చీఫ్‌గా యడ్యూరప్పను ఎన్నుకుంది. తమ పార్టీ తనను చీఫ్‌గా ఎన్నుకున్నట్లు యడ్యూరప్ప తెలిపారు. గవర్నర్ వాజూభాయ్ వాలాకు ఆ లేఖను సమర్పించినట్లు ఆయన చెప్పారు. సరైన నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ చెప్పారని, ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానిస్తారని తాను  ఆశిస్తున్నట్లు యడ్యూరప్ప తెలిపారు.

- Advertisement -