- Advertisement -
ఢిల్లీ: ఏపీలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. అనంతపురం జిల్లా జంతలూరులో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజన చట్టం ఆమోదం సందర్భంలో కేంద్ర ప్రభుత్వం పలు కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటుకు హామీ ఇచ్చింది. దీనికనుగుణంగానే తాజాగా కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
పూర్తిస్థాయి భవనాల నిర్మాణం పూర్తి అయ్యే వరకు తాత్కాలిక భవనాలలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. ఈ యూనివర్సిటీకి నిధుల విడుదల ప్రక్రియను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పర్యవేక్షించాలని సూచించింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం మీడియాకు తెలిపారు.
- Advertisement -