రాంచీ : జార్ఖండ్ రాష్ట్రంలో చిన్నారులు.. బడికి వెళ్ళాలంటే ఓ చేత విల్లంబులు.. మరో చేత పుస్తకాల సంచి పట్టుకొని అడవి గుండా బిక్కుబిక్కుమంటూ వెళ్ళాల్సిందే!
జార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టు ప్రాబల్యం తీవ్రంగా ఉన్న చకులియాస్ పోచపాని గ్రామానికి చెందిన విద్యార్థుల దుస్థితి ఇది. ఇక్కడి పిల్లలు పాఠశాలకు వెళ్లాలంటే రోజూ అడవి మార్గం గుండా వెళ్లాలి. అక్కడ మావోయిస్టులు ఉంటారనే భయం. ఈ దుర్భర పరిస్థితుల మధ్య కూడా చదువును ఆపకూడదనే సంకల్పంతో ఈ చిన్నారులు విల్లు, బాణాలు, గుల్లేరులు చేత పట్టుకొని బడికెళ్తున్నారు.
ఈ ప్రాంతంలో చదవుకోవాలన్నా.. తమ ప్రాణాలు రక్షించుకోవాలన్నా.. చేతిలో ఆయుధాలు తప్పనిసరిగా ఉండాల్సిందేని వారు అంటున్నారు. వారి దీనస్థితిని అద్దం పడుతున్న ఈ ఫొటోలను తాజాగా ఏఎన్‌ఐ ట్వీట్ చేసింది.
#Jharkhand: Children of naxal affected Chakulia’s Pochpani village carry bow & arrows to school to protect themselves from Naxals. Local says, “The children have to pass through forest area where a number of naxals have been spotted.” pic.twitter.com/TJJlSRsTxG
— ANI (@ANI) November 12, 2018