- Advertisement -
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులకు నిజంగా ఇదొక శుభవార్త. ఆన్లైన్ టిక్కెట్ల బుకింగ్‌పై ఉన్న పరిమితిని ‘ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) తాజాగా పెంచింది.
ఇప్పటి వరకు ఆధార్ అనుసంధానం లేని యూజర్ ఐడీకి 6 టిక్కెట్లు.. ఆధార్ అనుసంధానం అయి ఉన్న యూజర్ ఐడీకి 12 టిక్కెట్లు మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉండేది.
ఒకవేళ అంతకంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్నట్లయితే మళ్లీ మరో యూజర్ ఐడీ ద్వారా బుక్ చేసుకోవాల్సిందే. అయితే ఈ లిమిట్‌ను ఐఆర్సీటీసీ సోమవారం పెంచింది.
మారిన నిబంధనల ప్రకారం.. ఆన్లైన్ లేదా యాప్ ద్వారా ఆధార్ అనుసంధానం కాని యూజర్ ఐడీ నుంచి కూడా ఒక నెలలో ప్రయాణికులు 12 టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.
ఇక ఆన్లైన్ లేదా యాప్ ద్వారా ఆధార్ అనుసంధానం అయి ఉన్న యూజర్ ఐడీ ఉపయోగించి ఒక నెలలో ఏకంగా 24 టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.
- Advertisement -