27.8 C
Hyderabad
Sunday, October 11, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం జాగ్రత్త.. ఉగ్రదాడులకు పాకిస్తాన్ కుట్ర: ఇంటెలిజన్స్ హెచ్చరిక, రెండు రాష్ట్రాల్లో హై అలర్ట్!

జాగ్రత్త.. ఉగ్రదాడులకు పాకిస్తాన్ కుట్ర: ఇంటెలిజన్స్ హెచ్చరిక, రెండు రాష్ట్రాల్లో హై అలర్ట్!

high-alert-in-punjab-and-rajasthan
- Advertisement -

మ్న్యూమఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన తదితర పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ కుట్రలకు తెరతీసే ప్రమాదముందని, భారత్‌ను దెబ్బ తీసేందుకు మళ్లీ ఉగ్రదాడులు చేయొచ్చని ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరికలు జారీ చేసింది.

కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఇటీవలి చర్యలను పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతోందని,  ఈ నేపథ్యంలో అది తాను పెంచి, పోషిస్తున్న ఉగ్రమూకలను భారత్‌పై దాడులకు ఉసిగొల్పవచ్చని.. పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలపై బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గట్టి నిఘా ఉంచాలంటూ ఇంటెలిజెన్స్ విభాగం ఆ హెచ్చరికల్లో పేర్కొంది.

పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో హై అలర్ట్…

అంతేకాదు, ఉగ్రవాదులను సరిహ్దదులు దాటించేందుకు పాక్ సైన్యం కాల్పులకు కూడా తెగబడవచ్చని ఇంటెలిజెన్స్ హెచ్చరించిన నేపథ్యంలో పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇదే సమయంలో భారత నౌకాదళం కూడా అప్రమత్తంగా ఉండాలని, సముద్ర మార్గం ద్వారా కూడా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే అవకాశాలున్నాయని కూడా తెలుస్తోంది.

మరోవైపు, జమ్మూ కశ్మీర్‌‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ప్రసాదించిన ఆర్టికల్ 370ని మోడీ సర్కారు రద్దు చేసిన వెంటనే నియంత్రణరేఖ వద్దకు భారత సైన్యం అదనపు బలగాలను తరలించింది. పాక్ నుంచి ఎదురయ్యే ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు, అణచివేసేందుకు సర్వసన్నద్ధతతో ఆర్మీ ఉంది.

- Advertisement -