27.8 C
Hyderabad
Sunday, October 11, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం కుషీనగర్‌లో కుప్పకూలిన యుద్ధ విమానం: సేఫ్‌గా బయటపడ్డ పైలట్

కుషీనగర్‌లో కుప్పకూలిన యుద్ధ విమానం: సేఫ్‌గా బయటపడ్డ పైలట్

jet
- Advertisement -

లక్నో: భారత వాయుసేనకు చెందిన జాగ్వర్‌ యుద్ధ విమానం సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌ జిల్లాలో కుప్పకూలింది. గోరఖ్‌పూర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరిన విమానం హెతింపిర్‌ ప్రాంతం వద్ద కూలిపోయింది.

విమాన ప్రమాదం నుంచి పైలట్‌ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. జోధ్‌పూర్ సమీపంలోని బనడా ప్రాంతంలో సెప్టెంబర్ 4, 2018న మిగ్ 27 విమానం కుప్పకూలింది. ఆ తర్వాత యుద్ధ విమానం ఈ ఏడాది కూలిపోవడం ఇదే తొలిసారి.

కాగా, గత ఏడాది జూన్‌లో గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలో జాగ్వర్‌ యుద్ధ విమానం కూలిన ఘటనలో విమానం నడుపుతున్న సీనియర్‌ అధికారి మరణించారు. బరేజా గ్రామంలో విమానం కుప్పకూలడంతో పైలట్‌, జామ్‌నగర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ ఎయిర్‌ఆఫీసర్‌ కమాండింగ్‌ సంజయ్‌ చౌహాన్‌ మరణించారు.

- Advertisement -