
న్యూఢిల్లీ: భారత్‌పై పాక్ వైమానిక దాడులను తిరిగికొట్టే క్రమంలో మన దేశానికి చెందిన మిగ్-21 విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. దాంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ప్యారాచూట్ సాయంతో పాకిస్తాన్ భూభాగంలో దిగిపోవాల్సి వచ్చింది. అభినందన్ క్షేమంగా తిరిగి భారత్‌కు తిరిగి రావాలని యావత్ భరత ఖండం వేయి కళ్లతో ఎదురు చూసింది.
పూజలు, యాగాలు చేసింది. గడిచిన మూడు రోజులుగా దేశమంతా అభినందన స్మరణే. ఇక ప్రాణాలు పోయే పరిస్థితుల్లో కర్తవ్యం మరువలేదని, అభినందన్ ధైర్య సాహసాలపై పాక్ మీడియా కథనం కూడా ప్రచురించింది. శత్రు దేశానికి చిక్కిన అభినందన్‌ను తిరిగి తీసుకురావడానికి భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దాంతో జెనీవా ఒప్పందం ప్రకారం పాక్ మన వింగ్ కమాండర్ శుక్రవారం రాత్రి 9:21 నిముషాలకు వాఘా సరిహద్దు వద్ద అప్పగించింది.
ఓవైపు భారత్ వింగ్ హీరో అభినందన్ తిరిగి రావడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతోంటే.. మరోవైపు అందంగా, ఒడుపుగా తీర్చిద్దిన అభినందన్ మీసం పట్ల ఆకర్షణ మొదలైంది. తమిళ సంస్కృతిలోని ఆయన కట్టూ బొట్టూను అనుసరిచేందుకు మనోళ్లు రెడీ అయిపోయారు. ఆయనలా ‘గన్‌స్లింగర్’ మీసం తిప్పేందుకు సిద్ధమైపోయారు. ఇప్పుడీ గన్‌స్లింగర్ మీసం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఇంతకూ గన్‌స్లింగర్ అంటే..
How proud we are to have you ! Bow down to your skills and even more your grit and courage 🙏 #WelcomeBackAbhinandan . We love you and are filled with pride because of you.#WeAreSupposedToTellYouThis pic.twitter.com/IfqBFNNa3T
— Virender Sehwag (@virendersehwag) March 1, 2019
ఇక టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభినందన్ వీరత్వంపై ప్రశంసలు కురిపించాడు. ‘మీ వల్లే మేమేంతా నిశ్చింతగా.. గర్వంగా ఉండగలుగుతున్నాం. మీకు శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నాం’ అంటూ ట్వీట్ చేశారు.పురాతన కాలంలో ప్రత్యర్థి ఎత్తులకు చిక్కకుండా.. వారి సైన్యంపై గుళ్ల వర్షం కురిపిస్తూ గన్‌తో తుత్తునియలు చేసేవారిని గన్‌స్లింగర్ అనేవారు.
ధీరత్వం, ఠీవీ కలగలిసిన గన్‌స్లింగర్ శత్రువుల కంటబడినా చాకచక్యంగా తప్పించుకోవడం అతని నైజం. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా తరపున పోరాడిన జనరల్ అలెగ్జాండర్ షాలర్ అభినందన్ మాదిరి గుర్రెపు డెక్క మీసం కలిగి ఉండడం గమనార్హం. అసాధారణ పోరాటపటిమ చూపిన ఈ అమెరికా జనరల్‌కు మిలటరీలో అత్యున్నతమైన మెడల్ ఆఫ్ హానర్ దక్కడం విశేషం.
సంబంధిత వార్తలు:
- భారత్ మెరుపు దాడులు: పాక్ ఉగ్ర స్థావరాలు సర్వనాశనం
- విరుచుకుపడ్డ భారత వాయుసేన.. జైషే మహ్మద్ ఆల్ఫా-3 కంట్రోల్ రూమ్స్ ధ్వంసం! ఎక్స్ క్లూజివ్ వీడియో…
- పుల్వామా ఘటనపై ప్రతీకారం తీర్చుకున్న భారత్! వైమానిక దాడిని ధ్రువీకరించిన పాకిస్తాన్…
- ఇండియాస్ అమేజింగ్ ఫైటర్స్! భారత వాయుసేనకు ప్రశంసల వెల్లువ…
- పాక్ పై దాడికి కారణాలు వెల్లడించిన విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే!
- వైమానిక దాడులు: మోదీ అత్యవసర కేబినెట్ సమావేశం
- సర్జికల్ స్ట్రయిక్స్ 2.0: సత్తా చాటిన మిరేజ్ 2000 జెట్ ఫైటర్స్! కార్గిల్ యుద్ధంలోనూ జైత్రయాత్ర…
- శత్రువు ముందు తలొగ్గి ఉంటె బలహీనులమని కాదు! వైరల్ అవుతున్న ఆర్మీ ట్విట్!
- ‘సురక్షితమైన చేతుల్లోనే భారత్’: ఐఏఎఫ్ మెరుపుదాడిపై ప్రధాని మోడీ ఏమన్నారంటే…
- ప్రతిదాడికి సిద్ధమై.. వెనక్కి తగ్గిన పాక్ ఎయిర్ ఫోర్స్! సాయం కోసం చైనాకు ఫోన్, కానీ…
- లోపల గుబులు, పైకి గాంభీర్యం.. ఆదినుంచీ పాక్ ఎత్తుగడే ఇదే: భారత్ వైమానిక దాడిపై పాక్ ఇలా…
- దేనికైనా సిద్ధంగా ఉండండి: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, తమ భూభాగంలో భారత వైమానిక దాడిపై సీరియస్…
- పుల్వామాలో ఉగ్ర దాడి తర్వాతి రోజే మెరుపు దాడులకు గ్రీన్ సిగ్నల్!: అంతా సీక్రెట్‌గానే..
- రాత్రంతా జాగారం: మోడీ పూర్తి పర్యవేక్షణలోనే సర్జికల్ స్ట్రైక్స్ 2.0
- పాక్‌పై వైమానిక దాడిలో హైదరాబాదీ పైలట్! మిరాజ్ పైలట్లకు సిటీలోనే శిక్షణ?
- సర్జికల్ స్ట్రయిక్స్-2 కోసం భారత్ ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
- షాకింగ్: కశ్మీర్లో కుప్పకూలిన భారత యుద్ధ విమానం! పాకిస్తాన్ కూల్చేసిందా?
- ఇదే అంతిమ యుద్ధం కావొచ్చు! పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు!
- మా అదుపులోనే ఇద్దరు ఐఏఎఫ్ పైలట్లు: పాక్, వీడియో రిలీజ్, ఒక పైలట్ అదృశ్యమంటూ భారత్
- ప్రసంగం మధ్యలో వెళ్లిపోయిన మోదీ! కారణం ఇదేనా!
- భారత పైలట్‌పై పాక్ అమానుషం! అభినందన్ స్వస్థలం కేరళ!
- అమెరికా బిన్‌లాడెన్‌ను చంపినట్లే మేమూ చేయగలం: జైట్లీ
- ఒక్కసారి యుద్ధం మొదలైతే మన చేతుల్లో ఉండదు: చర్చలకు సిద్ధమంటూ ఇమ్రాన్
- మసూద్ అజార్‌పై నిషేధం విధించాల్సిందే: భారత్‌కు మద్దతుగా అగ్రదేశాలు








