26.2 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు సరికొత్త టైటిల్‌తో చైనాలో విడుదల కానున్న రోబో2.0 !

సరికొత్త టైటిల్‌తో చైనాలో విడుదల కానున్న రోబో2.0 !

- Advertisement -

చెన్నై: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రోబో. ఈ రోబో చిత్రానికి సీక్వెల్ గ గతేడాది రోబో 2 .ఓ విడుదలైన విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా రజని కెరియర్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది.

ఇందులో హీరోయిన్ గ అమీజాక్షన్ అదరగొట్టేసింది. ఇకపోతే నెగటివ్ రోల్ లో అక్షయ్ కుమార్ అందరిని తన నటనతో ఆశ్చర్యపరిచాడు. రజనీకాంత్‌కి దేశ, విదేశాలలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో 2.0 చిత్రాన్ని చైనాలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.

56 వేల స్క్రీన్స్‌లో రిలీజ్…

హెచ్‌వై మీడియా సంస్థ ఇప్పటికే చిత్ర డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకోగా మేలో చిత్ర విడుదలకి ప్లాన్ చేస్తున్నారట. అయితే చైనాలో ఈ చిత్రం ‘బాలీవుడ్ రోబో 2.0: రిసర్జెన్స్’ అనే టైటిల్‌తో విడుదల కానున్నట్టు తెలుస్తుంది. గతంలో చైనాలో విడుదలైన బాహుబలి 2 చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించిన సంగతి తెలిసిందే.

2019 మేలో 2.0 చిత్రాన్ని 10 వేల థియేటర్స్ ( 56 వేల స్క్రీన్స్‌లో ) విడుదల చేయబోతున్నట్టు లైకా గత ఏడాది డిసెంబర్‌లో అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే . ఇక 3డీలో 47 వేల స్క్రీన్స్‌లో ఈ చిత్రం విడుదల కానుండగా, ఓ విదేశీయ చిత్రం 3డీ ఫార్మాట్‌లో ఇంత భారీ సంఖ్యలో విడుదల కావడం ఇదే తొలిసారి.

హెచ్ వై మీడియా అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ 2.0 చిత్రాన్ని చైనాలో విడుదల చేస్తుంది. 2.0 చిత్రం ఇండియాలోను భారీ సంఖ్యలో విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలలోను ఈ చిత్రం భారీ సంఖ్యలో వసూళ్లు రాబట్టింది.

చదవండి: అర్జున్ రెడ్డి దర్శకుడికి నో చెప్పిన మహేష్! అసలు కారణం ఇదే!

- Advertisement -