న్యూఢిల్లీ: సాధారణంగా సాధువులు ఎలా ఉంటారు? జడలుకట్టిన జుట్టు, ఒంటి మీద కాషాయ వస్త్రాలు.. ఇలా ఊహించుకుంటాం. కానీ ఉత్తర భారతంలోని హరిద్వార్‌లో ఓ బాబా ఉన్నాడు. ‘గోల్డెన్ బాబా’గా పేరుగడించిన ఈయన అపరకుబేరుడు. ఈయన ఆస్తులు చూస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే.
ఒంటిపై 20 కిలోల బంగారం.. చేతికి 27 లక్షల విలువైన రోలెక్స్ వాచ్.. ఓ బీఎండబ్ల్యూ కారు, మూడు ఫార్చునర్లు, రెండు ఆడి, రెండు ఇన్నోవా కార్లు.. ఇవన్నీ ఈ బాబా సొంతం. ఈయన అసలు పేరు సుధీర్ మక్కర్. కాకపోతే ఒంటిపై భారీగా బంగారు నగలు ధరించి గోల్డెన్ బాబా’గా ప్రసిద్ధి పొందాడు. అంతేకాదు, ఈ గోల్డెన్ బాబా ప్రతియేటా హరిద్వార్ నుంచి ఢిల్లీకి 200 కిలోమీటర్ల మేర కన్వర్ యాత్ర నిర్వహిస్తుంటాడు.
ఈసారి కూడా ఈ బాబా తన కన్వర్ యాత్రతో మరోసారి వార్తల్లోకి వచ్చాడు. ఇప్పుడీ యాత్ర 25వ ఏట అడుగుపెట్టింది. ఈ యాత్రలో భాగంగా బాబా సుధీర్ తన ఒంటిపై 20 కిలోల బంగారం ధరించాడు. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం దీని విలువ రూ.6 కోట్లు. అంతేకాదు, ఏటా ఈయన ధరించే బంగారు నగలు పెరిగిపోతూనే ఉన్నాయి.
2016లో 12 కేజీలతో, 2017లో 14.5 కేజీల బంగారంతో అతను ఈ యాత్ర చేశాడు. యాత్రలో భాగంగా భక్తులు ఈ బంగారాన్ని ‘గోల్డెన్ బాబా’కు ఇచ్చేస్తుంటారు. ఇలా గతేడాది 21 గోల్డ్ చెయిన్లు, 21 దేవుడి లాకెట్లు, బ్రేస్‌లెట్స్, గోల్డ్ జాకెట్‌లు కూడా వచ్చాయి. ఓ ఎస్‌యూవీ వెహికిల్‌పై కూర్చొని గోల్డెన్ బాబా ఈ యాత్ర చేస్తుంటాడు.
ఆధ్యాత్మికత వైపు రాకముందు సుధీర్ మక్కర్ ఓ బట్టల వ్యాపారం చేస్తుండేవాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కోట్లకు అధిపతిగా మారాడు. ‘‘నా దగ్గరున్న కొత్త చెయిన్ బరువు 2 కిలోలు. ఈసారి ఎక్కువ బరువున్న బంగారు నగలు వేసుకోవడం లేదు. ఇలా చేయడం వల్ల నా మెడ నరాలు దెబ్బతిన్నాయి. ఒక కంటి చూపు మందగించింది. పైగా ఇదే నా చివరి కన్వర్ యాత్ర..’’ అని సుధీర్ మక్కర్ స్పష్టం చేశాడు.
ఈ కన్వర్ యాత్రలో భాగంగా బాబా వెంట లగ్జరీ కార్ల కాన్వాయ్ ఉంటుంది. అప్పుడప్పుడు హమ్మర్, జాగ్వార్, లాండ్ రోవర్‌లాంటి ఖరీదైన కార్లను రెంట్‌పై తీసుకొని వెళ్తాడు. తనకు బంగారంపై ఉన్న మోజు తగ్గదని, 1972లో తులానికి 200 ఉన్నప్పటి నుంచీ తాను బంగారం ధరిస్తున్నానని ఈ గోల్డెన్ బాబా చెబుతున్నాడు. తాను చచ్చిపోయే వరకు ఈ బంగారమంతా తన దగ్గరే ఉంటుందని, చనిపోయే సమయంలో తనకు నచ్చిన భక్తుడికి ఈ బంగారమంతా ఇస్తానని చెబుతున్నాడు.
Haridwar: Golden Baba, known for participating in Kanwar Yatra wearing gold jewellery, is undertaking his 25th Kanwar Yatra this year while wearing about 20 kg of gold jewellery. #Uttarakand (31.07.2018) pic.twitter.com/59Xl3ZZDqI
— ANI (@ANI) July 31, 2018