31.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం ఎస్పీతో పొత్తు తెగదెంపులు చేసుకున్న బీఎస్పీ

ఎస్పీతో పొత్తు తెగదెంపులు చేసుకున్న బీఎస్పీ

- Advertisement -

లక్నో: మాయావతి సారథ్యంలోని బీఎస్పీ,అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ పార్టీలు సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడి ఉత్తర్ ప్రదేశ్‌లో పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కూటమి అనుకున్న ఫలితాలని సాధించలేకపోయింది.

మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉన్న యూపీలో బీజేపీ62 స్థానాలు గెలుచుకోగా…మహాకూటమి కేవలం 15స్థానాలు గెలుచుకుంది. అందులో బీఎస్పీ 10 గెలిస్తే ఎస్పీ 5 గెలుచుకుంది.

అయితే ఎన్నికల్లో ఘోరంగా విఫలం కావడంపై మాయావతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక తాము ఎస్పీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని మాయావతి సోమవారం ప్రకటించారు. త్వరలో యూపీలో 11 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉపఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు.

పొత్తులపై తాము ఆధారపడమని, దాని వల్ల ప్రయోజనం లేదని గుర్తించామని అన్నారు. తాజా ఎన్నికల్లో యాదవుల ఓట్లు తమ పార్టీకి (బీఎస్పీ) కి పడలేదని, ముస్లింల ఓట్లే అఖిలేష్ పార్టీకి పడినట్టు కూడా తేలిందని ఆమె పేర్కొన్నారు. ఇక మహాకూటమి ‘ మాయ ‘ లో తాము పడే అవకాశంలేదని చెప్పారు.

ఇక ఎస్పీతో పొత్తు ఉండదని, అయినా అఖిలేశ్ తన భార్య డింపుల్ ని, తన బంధువులు అక్షయ్, ధర్మేంద్ర యాదవ్ లను కూడా గెలిపించుకోలేకపోయాడని ఆమె అన్నారు.

చదవండి: మమత రాక్షస కుటుంబానికి చెందినది: బీజేపీ ఎంపీ
- Advertisement -