
- Advertisement -
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దేశంలో కొత్త జీఎస్టీ విధానం అమల్లోకి రానున్నట్టు ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
లోక్‌సభలో నేడు బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి మాట్లాడుతూ.. ఒకే దేశం, ఒకే పన్ను విధానం సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. జీఎస్టీ ద్వారా దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని పేర్కొన్నారు.
ఏప్రిల్ నుంచి కొత్త జీఎస్టీ విధానం అమల్లోకి తీసుకొస్తామన్నారు. ఇన్‌స్పెక్టర్ రాజ్‌కు కాలం చెల్లిందన్న మంత్రి అందులో భాగంగానే పలు చెక్ పోస్టులను ఎత్తివేశామన్నారు.
ప్రజలపై దాదాపు పది శాతం వరకు పన్నుభారం తగ్గిందన్నారు. అలాగే జీఎస్టీ వల్ల గత రెండేళ్లలో కొత్తగా 16 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు పెరిగారని సభకు తెలిపారు. 40 కోట్ల మంది పన్ను రిటర్న్ ఫైల్ చేశారని వివరించారు.
- Advertisement -








