22.7 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ కరోనా ఎఫెక్ట్: డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు వద్దు.. సీపీకి వాదా ఫౌండేషన్ లేఖ

కరోనా ఎఫెక్ట్: డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు వద్దు.. సీపీకి వాదా ఫౌండేషన్ లేఖ

- Advertisement -

హైదరాబాద్: కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న నేపథ్యంలో నగరంలో డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించవద్దంటూ వాదా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సురేశ్ రాజు పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు.

నగరంలో కొన్ని రోజులపాటు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించకపోవడమే మంచిదని సూచించారు. మందుబాబులను పట్టుకునేందుకు ఈ టెస్టులు నిర్వహించినా బ్రీత్ ఎనలైజర్ పరికరాలు మాత్రం వాడొద్దన్నారు.

వీటివల్ల వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని సురేశ్ రాజు ఆందోళన వ్యక్తం చేశారు. నగరానికి వచ్చే విదేశీ పర్యాటకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.

చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. శరవేగంగా విస్తరిస్తూ వందలాదిమందిని బలి తీసుకుంటోంది. కరోనా వైరస్ కలకలంతో భారత్ కూడా అప్రమత్తమైంది.

చైనాలో ఉన్న భారతీయ విద్యార్థులను భారత్‌కు రప్పించింది. ఇందుకోసం ప్రత్యేక విమానాన్ని పంపింది. దేశంలో తొలి కరోనా కేసు కేరళలో నమోదైంది.

ఈ నేపథ్యంలో ఇది మరింతమందికి సోకకుండా ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. విదేశీ ప్రయాణికులకు విమానాశ్రయంలోనే పూర్తిస్థాయి స్కానింగ్ చేస్తోంది. అలాగే, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది.

- Advertisement -