22.7 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం ఢిల్లీ విద్యార్థులకు శుభవార్త! సీఎం కేజ్రీవాల్ మరో సంచలన నిర్ణయం…

ఢిల్లీ విద్యార్థులకు శుభవార్త! సీఎం కేజ్రీవాల్ మరో సంచలన నిర్ణయం…

- Advertisement -

న్యూఢిల్లీ: సంచలన నిర్ణయాలు ప్రకటిస్తూ వార్తల్లో నిలుస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా మరో సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.  రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10, 12వ తరగతి విద్యార్థుల పరీక్ష రుసుమును ఈ ఏడాది నుంచి ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ విషయాన్ని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా శుక్రవారం వెల్లడించారు. ఈ మేరకు ఈ ఫీజును విద్యార్థుల వద్ద నుంచి వసూలు చేయరాదని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటికే ఆదేశాలు పంపినట్టు ఆయన తెలిపారు.

10, 12వ తరగతుల పరీక్ష ఫీజులను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) ఇటీవల భారీగా పెంచిన నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ బోర్డు ప్రభుత్వ పాఠశాలల్లో 10, 12 తరగతులు చదువుతున్న విద్యార్థుల నుంచి గతంలో రూ.50 చొప్పున పరీక్ష రుసుము వసూలు చేసేది. 

సీబీఎస్ఈ బోర్డు వసూలు చేసే ఈ పరీక్ష ఫీజును ఢిల్లీ ప్రభుత్వం కావాలనుకుంటే రీయింబర్స్‌మెంట్ ద్వారా ఆ విద్యార్థులకు తిరిగి  చెల్లించవచ్చని బోర్డు ఆగస్టు 11న కేజ్రీవాల్ ప్రభుత్వానికి సూచించింది. కానీ ఆ తరువాత రెండు రోజులకే.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు గతంలో మాదిరిగానే పరీక్ష రుసుము చెల్లించాలంటూ.. బోర్డు మళ్లీ ఆదేశాలు జారీ చేసింది. 

దీంతో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం స్పందిస్తూ.. ఒక్క ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు మాత్రమే కాదని, ఢిల్లీ వ్యాప్తంగా  ప్రభుత్వ పాఠశాలల్లో 10, 12 తరగతులు చదువుతున్న విద్యార్థులందరూ ఈ ఏడాది నుంచి పరీక్ష ఫీజును చెల్లించనక్కర్లేదని, ఆ ఫీజును ప్రభుత్వమే సీబీఎస్ఈ బోర్డుకు చెల్లిస్తుందని పేర్కొంటూ.. అందుకు అవసరమైన ఆదేశాలు జారీ చేసింది.


 

- Advertisement -