23.8 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం ఢిల్లీలో భారీ వర్షం, వడగళ్లు: ఉదయం 9 గంటలైనా చీకట్లోనే దేశ రాజధాని! ఆలస్యంగా రైళ్లు…

ఢిల్లీలో భారీ వర్షం, వడగళ్లు: ఉదయం 9 గంటలైనా చీకట్లోనే దేశ రాజధాని! ఆలస్యంగా రైళ్లు…

delhi-rain
- Advertisement -

delhi-rain

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని రెండ్రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం నుంచి ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం ఉదయం నుంచి ఢిల్లీ, గురుగ్రామ్‌ ప్రాంతాల్లో వడగళ్ల వాన కురుస్తోంది.

భారీ వర్షం కారణంగా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్లటి మేఘాలు కమ్ముకోవడంతో నగరమంతా చీకటిమయమైంది. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలోనూ అర్ధరాత్రిని తలపించేలా చీకట్లు కమ్ముకున్నాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్రం అంతరాయం ఏర్పడింది.

వర్షం కారణంగా రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో ఎదురుగా వస్తున్న వాహనాలు కన్పించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. పలుచోట్ల రోడ్డు ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి.

భారీ వర్షాలు, వడగళ్ల కారణంగా ఢిల్లీకి వెళ్లే దాదాపు 15 రైళ్లు ఆలస్యమైనట్లు అధికారులు వెల్లడించారు. పంజాబ్‌, ఛండీగఢ్‌, ఉత్తరాఖండ్‌లోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అటు హిమాచల్‌ ప్రదేశ్‌లో సిమ్లా సహా కొన్ని ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. దీంతో అక్కడి ప్రజలు, వాహనదారులు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు.

- Advertisement -