
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అనంతరం స్పీకర్ ఓం బిర్లా అనుమతితో ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మలా మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ దేశంలోని అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని, ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలకు మేలు చేస్తుందని తెలిపారు.
అంతకుముందు కేంద్ర బడ్జెట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉదయం 10.30కి పార్లమెంట్ ఆవరణలో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమైంది. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆమె బడ్జెట్ పత్రాల కాపీని ఆయనకు అందజేశారు.
అనంతరం నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్ నుంచి నేరుగా పార్లమెంట్‌కు బయలుదేరి వెళ్లారు. బడ్జెట్ ప్రసంగాన్ని వినేందుకు నిర్మలా సీతారామన్ తల్లిదండ్రులు కూడా పార్లమెంట్‌కు వచ్చారు. వారిని అక్కడి సిబ్బంది, అధికారులు సాదరంగా ఆహ్వానించి లోనికి తీసుకెళ్లారు.
మరి బడ్జెట్ ప్రకారం ఏయే వస్తువుల ధరలు తగ్గుతాయి, వేటికి ధరలు పెరుగుతాయంటే..
ధరలు తగ్గేవి ఇవే…
దిగుమతి చేసుకుని రక్షణ పరికరాలు, దిగుమతి చేసుకునే ఉన్ని, కృత్రిమ మూత్ర పిండాలకు వాడి ముడి పదార్థాలు, దిగుమతి చేసుకునే ఈ-వెహికల్స్ విడి భాగాలు, ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు.
ధరలు పెరిగేవి ఇవీ…
పెట్రోల్, డీజిల్, సిగరెట్లు, చుట్టలు, పొగాకు, పాన్ మసాలా, స్టెయిన్ లెస్ స్టీల్ వస్తువులు, దిగుమతి చేసుకునే బంగారం, దిగుమతి చేసుకునే ప్లాటినం, సీసీటీవీ మరియు ఐపీ కెమెరాలు (ఇంటర్నెట్ ప్రొటోకాల్ కెమెరాలు), డిజిటల్ అండ్ నెట్‌వర్క్ వీడియో రికార్డర్లు.
ఇంకా.. ఆప్టికల్ ఫైబర్ కేబుల్, దిగుమతి చేసుకునే లోహాలు, దిగుమతి చేసుకునే స్ప్లిట్ ఏసీలు, మెటల్ ఫిట్టింగ్స్, దిగుమతి చేసుకునే ఆటోమొబైల్ పార్ట్స్, టైల్స్, వినైల్ ఫ్లోరింగ్, పీవీసీ, దిగుమతి చేసుకునే లౌడ్ స్పీకర్లు, దిగుమతి చేసుకునే ప్లగ్గులు, సాకెట్లు, స్విచ్‌లు, దిగుమతి చేసుకునే పుస్తకాలు.








