‘‘జూనియర్ ఎన్టీఆర్‌తో అఫైర్.. మా ఇంట్లో తెలిసింది.. అందుకే సినిమాలకు దూరమయ్యా..’’

5:14 pm, Thu, 4 July 19
sameera-reddy-with-junior-ntr

హైదరాబాద్: ఏ చిత్ర పరిశ్రమలోనైనా నటీ నటుల మధ్య అఫైర్స్ కామనే. బాలీవుడ్‌లో అయితే లవ్ అఫైర్స్ ఎక్కువ. దక్షిణాది చిత్రపరిశ్రమల్లో చూస్తే ఈ అఫైర్లు కొంత వరకు తక్కువేకానీ మరీ లేవని చెప్పలేం.

హీరో హీరోయిన్ల మధ్య అఫైర్ల సంగతి ఏమోగానీ.. పుకార్లు మాత్రం తరచూ షికార్లు చేస్తుంటాయి. ఇలాంటి విషయాలు బయటికి వచ్చినప్పుడల్లా మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోతుంటాయి.

చదవండి: ఆర్య భార్యతో.. అఖిల్ రొమాన్స్!? ఫస్ట్ కాంబినేషన్ ఈసారైనా వర్కవుట్ అవుతుందా?

అయితే అఫైర్లు, పుకార్ల గురించి కొత్తలో హీరో హీరోయిన్లు బాధ పడతారుగానీ రానురాను.. ఈ పరిశ్రమే అలాంటిదని అర్థమైపోతుంది. ఆ తరువాత మాత్రం పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అయితే ఒక్కోసారి ఇలాంటి పుకార్లు నటీ నటుల కెరీర్, జీవితాలపై కూడా ప్రభావం చూపిస్తుంటాయి.

సమీరా రెడ్డి కెరీర్‌లోనూ…

ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. హీరోయిన్ సమీరా రెడ్డి గుర్తుంది కదా? ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సమీరా రెడ్డి తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ముంబైకి చెందిన అక్షయ్ అనే వ్యాపారవేత్తని ఈమె వివాహం చేసుకుంది. అంతేకాదు, త్వరలోనే సమీరా రెడ్డి తన రెండో బిడ్డకు జన్మనివ్వబోతోంది కూడా.

అయితే సమీరా రెడ్డి సినిమాల్లో నటించే సమయంలో ఇలాంటి పుకార్లతో చాలా ఇబ్బంది పడిందట. ఆ విషయాన్ని ఇటీవల స్వయంగా సమీరాయే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, సూర్య లాంటి స్టార్ హీరోలతో జత కట్టిందీమె.

చదవండి: షాకింగ్: హీరోయిన్ నగ్న ఫొటోలు, వీడియోలు హ్యాక్.. ఆపైన బ్లాక్ మెయిలింగ్!

గ్లామర్, నటనపరంగా టాప్ పొజిషన్‌కు వెళ్లాల్సిన నటి సమీరా రెడ్డి. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్‌, సమీరా రెడ్డిల క్లోజ్‌నెస్ చూసి వారి మధ్య ఏదో అఫైర్ ఉందనే పుకార్లు కొన్నాళ్లు షికార్లు చేశాయి. వీరిద్దరూ నరసింహుడు, అశోక్ చిత్రాల్లో జంటగా నటించారు.

ఎన్టీఆర్‌తో తాను ప్రేమలో ఉన్నానంటూ అప్పట్లో వచ్చిన ఊహాగానాలు తన కెరీర్‌పై ప్రభావం చూపాయని సమీరా తాజాగా ఆ ఇంటర్వ్యూలో పేర్కొంది. అయితే ఎన్టీఆర్‌తో తనకున్న రిలేషన్ కేవలం ఫ్రెండ్‌షిప్ మాత్రమేనని, స్నేహితుడు కాబట్టి తాను అతడితో అంత సన్నిహితంగా మెలిగేదాన్ని అని, అంతకుమించి తమిద్దరి మధ్య ఇంకేమీ లేదని ఆమె క్లారిటీ ఇచ్చింది.

జనం మా రిలేషన్ షిప్ గురించి మాట్లాడుకోవడం, దానిపై మీడియాలో వార్తలు రావడంతో అది మా ఇంట్లో వాళ్లకూ తెలిసింది. అప్పట్లో అదొక పెద్ద సమస్యగా మారుతుండడంతో క్రమంగా తానే టాలీవుడ్ సినిమాలకు దూరమయ్యానని సమీరా రెడ్డి పేర్కొంది.

చదవండి: ఎంతో పొందాను.. ఇంకెంతో కోల్పోయాను, అందుకే నటనకు గుడ్ బై!: ‘దంగల్’ ఫేమ్ జైరా వాసిం