‘జుమాంజీ: ది నెక్స్ట్ లెవల్’ ట్రైలర్ రిలీజ్! క్రిస్మస్‌కి సినిమా విడుదల…

jumanji-the-next-level-movie-trailer
- Advertisement -

వాషింగ్టన్: ‘జుమాంజీ’ సినిమా గుర్తుందా? మరీ పాతది కాదు. 1995లో రాబిన్ విలియమ్స్ నటించిన సినిమా కాకుండా 2017లో వచ్చిన ‘జుమాంజీ: వెల్‌ కమ్‌ టు ది జంగిల్‌’. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలుసు కదా?

డ్వెన్ జాన్సన్‌, జాక్‌ బ్లాక్‌, కెవిన్‌ హార్ట్‌, కారెన్‌ గిల్లాన్‌లు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ బద్ధలు కొట్టింది. ఏకంగా 962 మిలియన్‌ డాలర్లను వసూలు చేసింది.  ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతోంది.

చదవండి: జేమ్స్ కేమరాన్ డబుల్ ధమాకా.. ‘అవతార్’కు మించిన రీతిలో సీక్వెల్స్.. 2020 డిసెంబర్‌లో విడుదల!?

‘జుమాంజీ: ది నెక్ట్స్‌ లెవల్‌’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. క్లుప్తంగా కథేమిటంటే.. వీడియోగేమ్‌ ఆడటం ప్రారంభించిన నలుగురు విద్యార్థులను ఆ గేమ్‌లోకి లోపలికి లాగేస్తుంది. మళ్లీ దాంట్లోంచి బయట పడాలంటే, ఆ గేమ్‌లో నిర్దేశించిన లక్ష్యాలను, అడ్డంకులను దాటుకుంటూ వెళ్లాలి.

అడవితో పాటు, ఎడారి, మంచు కొండల్లో…

తొలి భాగం ‘జుమాంజీ: వెల్‌ కమ్‌ టు ది జంగిల్‌’ మూవీలో కథంతా అడవిలో సాగితే, ఇప్పుడు దాని సీక్వెల్‌గా రాబోయే చిత్రం ‘జుమాంజీ: ది నెక్ట్స్‌ లెవల్‌’ సినిమాలో కథ.. అడవితో పాటు, ఎడారి, మంచు కొండల్లో కూడా సాగనుంది. మొదటి భాగాన్ని మించి యాక్షన్‌ సన్నివేశాలతో రెండో భాగాన్ని అద్భుతంగా రూపొందిస్తున్నారు.

చదవండి: హీరోయిన్ ప్రైవేట్ పార్ట్స్‌పై పబ్లిక్‌గా చెయ్యేసిన డైరెక్టర్.. షాక్ తిన్న హీరోయిన్!

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ ఏడాది క్రిస్‌మస్‌ కానుకగా ‘జుమాంజీ: నెక్ట్స్‌ లెవల్‌’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ చూసి సినిమా ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చు.. ఓ లుక్కేయండి మరి!

 

- Advertisement -